Nitin gadkari says toilets become temples

nitin gadkari, nitin gadkari family, nitin gadkari case, nitin gadkari caste, nitin gadkari bjp, nitin gadkari photos, nitin gadkari comments on toilets, temples, indian temples, toilets, government toilets, sulabh organisation, latest news

central minister nithin gadkari says he saw some places toilets basement become land for temples : government giving toilets to poor people but not providing water so people using toilets for other purpose

దేవాలయాలుగా మారుతున్న టాయిలెట్లు

Posted: 09/16/2014 01:27 PM IST
Nitin gadkari says toilets become temples

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసేందుకు దేవాలయాలను టాయ్ లెట్లును ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల టాయ్ లెట్లు దేవాలయాలుగా మారుతున్నాయని విమర్శించారు. కేవలం టెంపుల్స్ గానే కాదు కొన్నిచోట్ల గోడౌన్లుగా., చిన్న రూములుగా కూడా మారుతున్నాయన్నారు. పేదలు టాయ్ లెట్ ప్రదేశాన్ని ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనపై నిర్వహించిన మీడియా సమావేశంలో గడ్కరీ మాట్లాడారు. ఈ సందర్బంగా విలేఖర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు.

దేశంలో టాయ్ లెట్ల సంఖ్య పెరిగిందనీ అయితే వినియోగం మాత్రం పెరగలేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల వాటిని పేదలు ఉపయోగించలేకపోతున్నారని చెప్పారు. మరుగుదొడ్లు కట్టించిన ప్రభుత్వం.. వాటిని వినియోగించేందుకు నీటిని ఇవ్వటంలో విఫలం అయిందన్నారు. దీంతో ప్రజలు వాటిని ఇతర అవసరాలు, పనుల కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. కొన్నిచోట్ల టాయ్ లెట్ల పునాదులపై దేవాలయాలు నిర్మించటం స్వయంగా చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. నీటి లభ్యత లేకుండా నిర్మించి ఏం లాభమో యూపీఏ పెద్దలు చెప్పాలన్నారు.

యూపీఏ హయాంలో గ్రామీణాభివృద్ధి పధకాల కింద పేద కుటుంబాలకు ఉచితంగా, ఆర్ధిక సాయం చేసి ప్రభుత్వమే టాయ్ లెట్లు కట్టించింది. అయితే దీనిలో కూడా చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సిమెంటు, టాయిలెట్ నిర్మాణం నాసిరకంగా ఉందని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చాలా చోట్ల మరుగుదొడ్డి కట్టకుండానే తలుపులు, భూగర్బంలో వేసే రింగులను తీసుకెళ్ళారని తేలింది. అంతేకాకుండా కొందరు అక్రమంగా పేదల పేరుతో మరుగుదొడ్లను మంజూరు చేసి డబ్బులు దండుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఉన్నవి కూడా నిరుపయోగమే అని మంత్రి విమర్శలు చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : toilets  temples  nitin gadkari  latest news  

Other Articles