Karan singh five years old boy in 5 7 height

karan singh, karan singh hight, tall boy, tall girl, tall boy karan singh, karan singh mother, karan singh family, tall records, gunnies records, india gunnies records, latest news, uttarpradesh, meerut, swethlana singh, swethlana singh photo, swethalana singh hight, swethlana singh family, karan singh and swethlana singh

uttarpradesh's meerut boy karan singh attracting by his hight that 5.7feets in 5years age : not only karan singh his mother swethlana singh also in big hight with 7.2feets interestingly her hight growing 2inches for every year

ఐదేళ్లకే ఆరడుగులు పెరిగిన పిల్లాడు

Posted: 09/16/2014 12:55 PM IST
Karan singh five years old boy in 5 7 height

వీడు ఆరడుగుల బుల్లెట్టు అనే పాట పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అత్తారింటికి దారేదిలో ఓ పాట ఉంది. అయితే ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ బాలుడిని చూస్తే మాత్రం వీడు ఆరడుగుల బుడతడురోయ్ అని మార్చి పాడుకుంటారంతా. ఆ బాలుడి ఎత్తు అలాంటిది. ఐదడుగుల వయస్సంటే కనీసం డైనింగ్ టేబుల్ కుర్చీ మీద సరిగా కూర్చోలేరు. అలాంటిది ఈ అబ్బాయి మాత్రం ఏకంగా డైనింగ్ టేబులే ఎక్కేస్తున్నాడు. ఇదంతా యూపీకి చెందిన పొడుగు పిల్లాడు కరణ్ సింగ్ గురించి. ఐదేళ్ల వయస్సున్న కరణ్ సింగ్ ఎత్తు ప్రస్తుతం 5అడుగుల 7 అంగుళాలు.

మీరు చదువుతున్నది వాస్తవమే.. కావాలంటే పైన ఫొటో చూసుకోండి. తన వయస్సున్న వారితో కరణ్ ను ఎత్తును కొలిచినపుడు ఎంత పొడవు ఎక్కువగా ఉన్నాడో తెలుస్తుంది. త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కే ఈ బుడతడిని చూసి స్కూళ్లో మొదట్లో పిల్లలు భయపడ్డారట. అంతా ఒక హైటు ఉంటే కరణ్ మాత్రం ఏపుగా ఎదిగాడు. దీంతో పెద్దవాడు.., తమను కొడతారని ఎవరూ దగ్గరకు కూడా వెళ్లేవారు కాదట. అయితే తమ వయస్సే అని తెలుసుకుని ఇప్పుడిప్పుడే స్నేహితులు అవుతున్నారట. ఇంతకీ ఈ ఎత్తు జన్యుపర లోపం అనుకుంటే తప్పే.. ఇది జన్యువారసత్వం వల్ల వచ్చింది. అవును కరణ్ తల్లి ఏడడుగులు యూపీ ఆడపడుచు.

కరణ్ తల్లి స్వెత్లానా సింగ్ ప్రస్తుతం ఏడు అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉంది. అమ్మాయిల్లో మెజార్టీ వయస్సు రాగానే ఎత్తు పెరగటం ఆగిపోతుంది. అయితే చిత్రం ఏమిటంటే స్వెత్లానాసింగ్ లో మాత్రం ఇప్పటికీ పెరుగుదల ఉంది. ప్రతి సంవత్సరం రెండు అంగుళాల చొప్పున ఎత్తు పెరుగుతుంది. ప్రస్తుతం ఈమె వయస్సు 25సం.లు. ఇలాగే పెరిగితే పొడవైన మహిళగా విదేశీయురాలిపై ఉన్న రికార్డును స్వెత్లానా చెరిపేయటం ఖాయం. తన భార్య ఎదుగుదలపై ఆమె భర్త సంజయ్ సింగ్ ఏమన్నాడంటే.., ‘‘ఏడేళ్ల క్రితం మా పెళ్లి అయినపుడు నా భార్య ఎత్తు 6.6అడుగులు ఇప్పుడు మాత్రం 7.2 అడుగులు ముందు ఇద్దరం ఒకే ఎత్తులో ఉండి సరిజోడిలా కన్పించేవాళ్ళం. కాని ఇప్పుడు నా భార్య ఎత్తుకు ఎదిగిపోయింది. తనను చూడాలంటే తలెత్తుకునేలా చేసింది.’’ అని నవ్వుతూ చెప్తున్నాడు.

ఇక తల్లి, కొడుకుల ఎత్తులను చూసిన విదేశీ మీడియా ఆశ్చర్యపోతోంది. వీరి దగ్గరకు వచ్చి, ఫొటోలు, వీడియోలు తీసి ప్రసారాలు చేస్తున్నారు. టాల్ ఫ్యామిలీ అని తెగ పొగిడేస్తున్నారు. వీరు ఎత్తు పెరిగేందుకు ఏ మందు తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోలేదు. అది ఏదో అలా జరిగిపోయింది అని చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karan singh  swethlana singh  tall boy  latest news  

Other Articles