Kakatiya university invents medicine for aids

kakatiya university, kakatiya university courses, kakatiya university exams, kakatiya university results, botany, botany research, botany exam qeustions, warangal, hanmakonda, aids, hiv, aids medicine, medicine for aids, medicine hiv, hiv abbrivation, diseases, medicines, aids symptoms, latest news, sex

kakatiya university research fellows invented curing medicine for aids : keyshia occidentalis plant will cures aids and hiv says kakatiya university botany department research fellows

ఎయిడ్స్ కు మందు కనుక్కున్న కాకతీయులు

Posted: 09/16/2014 10:48 AM IST
Kakatiya university invents medicine for aids

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. మనిషిని పతనావస్థకు తీసుకువచ్చ హెచ్.ఐ.వి. వైరస్ కు విరుగుడు వచ్చేస్తోంది. ఈ భయకంర వ్యాధికి కాకతీయ యునివర్సిటి మందు కనిపెట్టింది. అది కూడా తెలంగాణలో సహజసిద్దంగా విరివిగా దొరికే చెట్లతో కావటం విశేషం. ప్రస్తుతం ప్రొఫెసర్లు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. వారు రూపొందంచిన మందు ప్రాధమికంగా ఎయిడ్స్ వైరస్ ను కట్టడి చేస్తుందని నమ్మిన కేంద్రం పరిశోధనలు చేసేందుకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. ఇదే నిజం అయితే ఇక ఎయిడ్స్ తో చనిపోయారు అనే మాటలు త్వరలో మనకు వినబడవు.

బోటనీ ప్రోఫెసర్ సృష్టి

కాకతీయ యునివర్సిటీలోని బాటనీ ( వృక్షశాస్ర్తం) ప్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల ‘తెలంగాణ అడవుల్లో నివసించే గిరిజనులు- వనమూలిక వైద్యం’ అనే అంశంపై పరిశోధనలు జరిపారు. రాష్ర్టంలోని వరంగల్; ఖమ్మం, అదిలాబాద్, అడవుల్లో గిరిజనులు, ఆదివాసీలు ఉపయోగించే మూలికల వివరాలను తెలుసుకున్నారు. వారు వైద్యం కోసం 65 జాతులకు చెందిన ఔషదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. వీటిలో ఎక్కువగా పిండికూర, బ్రహ్మమేడి, నరమామిడి, పులిచేరు, సోమిడిచెక్క, అడవి తంగేడు, తిప్పతీగ, పున్నరవ ఉపయోగిస్తున్నట్లు గుర్తించి వాటిపై పరిశోధనలు జరిపారు. వీటి వల్ల ఎక్కువగా పాముకాటు, రక్త శుధ్ది, వీర్యవృద్ధి, సుఖవ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధులతో పాటు ఇతర రోగాలు నయం అవుతాయని తెలుసుకున్నారు.

వీటిలో అడవి తంగేడు, తిప్పతీగను సుఖవ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారని పరిశోదనల్లో తెలిసింది. ఈ రెండు మొక్కలపై పరిశోధనలు జరిపి ప్రొఫెసర్లకు అద్బుత విషయం తెలిసింది. ఈ రెండు మొక్కలు ఎయిడ్స్ వ్యాధిని వ్యాప్తి చేసే వైరస్ వృద్ధిని తగ్గించినట్లు ప్రయోగంలో తేలింది. హెచ్ ఐ వి వైరస్ ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి వ్యాపిస్తుంది. శరీంలోకి ప్రవేశించాక వైరస్ ఎదుగుదల అనేది అందులో ఉండే ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ ఎంజైములపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంజైముల వేగంగా పనిచేస్తే.., వైరస్ త్వరగా అభివృద్ధి చెందుతుంది. అడవి తంగేడు ఆకులగ, తిప్పతీగ మొక్కలో ఉండే ఔషధ గుణాలకు ఈ ఎంజైముల పనిచేసే గుణం తగ్గించే శక్తి ఉందని గుర్తించారు. ఈ విషయం కేంద్రంానికి తెలపగా.., శాస్ర్త, సాంకేతిక శాఖ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. అటు విదేశాల్లో కూడా వీరి పరిశోధనలకు ప్రశంసలు వచ్చాయి. పలు పత్రికలు, మ్యాగజైన్లు ఈ పరిశోధనలపై కధనాలు ప్రచురించాయి.

కేంద్రం ప్రోత్సాహం

భయంకర వ్యాధికి విరుగుడు కనిపట్టే పనిలో ఉన్న ప్రొఫసర్ కృషికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. పరిశోధనలు కొనసాగించేందుకు కేంద్ర శాస్ర్త సాంకేతిక శాఖ గతేడాది 21లక్షల రూపాయలు విడుదల చేసింది. అదేవిధంగా వర్సిటీ బయో టెక్నాలజి డిపార్ట్ మెంటు 47 లక్షలు విడుదల చేసింది. దీంతో వీరి పరిశధనలను మరింత అధునాతనంగా.., అన్ని కోణాల్లో చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రయోగం ఫలించి మాయ వైరస్ కు మందు కనిపెడితే లక్షల మందికి ప్రాణం పోసినవారవుతారు. భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే రోగాన్ని నయం చేసిన వైద్యులుగా వీరి పేరు చరిత్రకెక్కటంతో పాటు., తెలుగుదనం, తెలంగాణ గొప్పదనం నలుదిశలా వ్యాప్తి చెందుతుంది. ఆల్ ది బెస్ట్ ఇస్తారి అండ్ టీం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aids  hiv medicine  kakatiya university  latest news  

Other Articles