Robbery in ibrahimpatnam near vijayawada

thieves, robbery, latest news, vijayawada, colony, colonies, police, ibrahimpatnam, crime news, andhrapradesh, krishna district, rayannapadu

thieves kept lock all houses of a colony in rayannapadu area and robbed a house : police enquiring robbery of kalpataruvu colony in rayannapadu area

ఎదురింటికి తాళం వేసి, ఆ ఇంట్లో దొంగతనం చేశారు

Posted: 09/16/2014 10:36 AM IST
Robbery in ibrahimpatnam near vijayawada

ఏపీ రాజధాని విజయవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దొంగతనాల కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు. బెజవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం రాయన్నపాడులో ఎదురిళ్ళకు తాళం వేసి మరీ ఓ ఇంట్లో దొంగతనం చేశారు. రాయన్నపాడు కల్పతరువు కాలనీలో ఓ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి కుటుంబ సభ్యులను బంధించి డబ్బులు, నగలు ఇవ్వాలని బెదిరించారు. ముందుగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో వారిని కట్టేసి బెదిరించారు. భయపడ్డ బాధితులు నగలు, నగదు ఎక్కడ ఉన్నాయో దొంగలకు వివరించారు. వాటిని తీసుకుని పరారయ్యారు.

అయితే ఇక్కడే వారు ట్విస్ట్ ఇచ్చారు. దొంగతనం చేసే సమయంలో ఎవరూ బయటకు రాకుండా పక్కా ప్రణాళికలతో కాలనీలోని పలు ఇళ్లకు తాళాలు వేశారు. ఈ ఉదయం దొంగతనం జరిగిన ఇంట్లోకి పని మనిషి ఇంట్లోకి రావడంతో కుటుంబ సభ్యులంతా తాళ్ళతో కట్టేసి బంధీలుగా కన్పించారు. దీంతో భయపడి స్థానికులకు సమాచారం అందించింది. వారంతా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగల దాడిలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robbery  rayannapadu  crime news  latest news  

Other Articles