Trs minister harish rao challenges pawan kalyan chandrababu medak mp by elections

pawan kalyan, harish rao, chandrababu naidu, medak mp elections, harish rao latest interview, trs party ministers, trs party leaders, bjp party leaders, tdp party ministers, pawan kalyan janasena, jagga reddy

trs minister harish rao challenges pawan kalyan chandrababu medak mp by elections

జనసేన పవన్ కు మరోసారి సవాల్ విసిరిన టీఆర్ఎస్!

Posted: 09/05/2014 10:00 AM IST
Trs minister harish rao challenges pawan kalyan chandrababu medak mp by elections

(Image source from: trs minister harish rao challenges pawan kalyan chandrababu medak mp by elections)

పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి అతనికి, టీఆర్ఎస్ కి తరచూ ఏదో ఒక వివాదం జరుగుతూనే వుంది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానో ఒకరిమీద ఇంకొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరింది. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే తమ సవాల్ కు వ్యతిరేకంగా నిలబడి చూపించాలంటూ బహిరంగంగా వారు చాలెంజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో వీరిమధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి. టీఆర్ఎస్ పార్టీ మెదక్ స్థానం కోసం రెండు జాతీయ పార్టీలతో (కాంగ్రెస్, బీజేపీ) పోటీపడుతూ... మెదక్ ఎంపీ స్థానం తమ్మకే దక్కుతుందని ఆ పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలుగుదేశం అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కు తాజాగా మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే వాళ్లు తమ పార్టీ తరఫునుంచి ప్రచారాలు చేసుకోవడం కోసం మెదక్ కు రావాలంటూ ఆయన పేర్కొన్నారు. మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి అయిన జగ్గారెడ్డి తరఫున పవన్, బాబుల్లో ఎవరికి ధైర్యం వుంటే వాళ్లు ప్రచారానికి రావాలని అంటున్నారు. జగ్గారెడ్డిని మెదక్ స్థానంలో పోటీగా నిలబెట్టేలా వ్యూహరచన చేసిన వారిద్దరూ.. ప్రస్తుతం ఆయన్ను గెలిపించే బాధ్యత తీసుకోవడానికి సంకోచిస్తున్నారని తెలిపారు.

ఒకవేళ మెదక్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే తాను తన ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రకటించిన హరీష్ రావు.. పవన్, టీడీపీ వర్గాలవారు ఈ సవాల్ ను దమ్ముంటే తీసుకొని బరిలోకి దిగాల్సిందిగా ఆయన ఛాలెంజ్ చేశాడు. టీఆర్ఎస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన హరీష్... బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని ఖచ్చితంగా ఓడిస్తామని.. ఆ విషయం తెలిసే టీడీపీ, పవన్ లు ప్రచారానికి రావడం లేదని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  harish rao  chandrababu naidu  medak mp elections  jagga reddy  

Other Articles