Ap capital near vijayawada

andhrapradesh, ap capital, latest news, chandrababu naidu, latest news, vijayawada, kurnool, shivaramakrishnan committee

ap cm chandrababu naidu announced vijayawada as capital for state : ap capital in vijayawada surroundings says babu in assembly

బెజవాడే రాజధాని

Posted: 09/04/2014 12:27 PM IST
Ap capital near vijayawada

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. విజయవాడ చుట్టూనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని అన్నిప్రాంతాలవారికి అందుబాటులో ఉండే విధంగా మద్యలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చంద్రబాబు ఇరవై పేజీల ప్రకటన చేశారు. జిల్లాలవారిగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

రాజధానిపై అసెంబ్లీలో రెండ్రోజులుగా నడుస్తున్న గందరగోళం మద్యే చంద్రబాబు ప్రకటన చేశారు. రెండవ వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల ఆందోళనల మద్య రాజధానిపై ప్రకటన చేశారు. ఈనెల 1న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం విజయవాడ పరిసరాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. ప్రధానమైన భూ సేకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తన్నట్లు చెప్పారు.

విజయవాడ పరిసరాల్లో రాజధాని అని ప్రకటన చేశారు తప్ప.., ఏ ఏ ప్రాంతాలను ఆనుకుని రాజధాని ఉంటుందని స్పష్టంగా చెప్పలేదు. ఏపీ సర్కారు తెరపైకి తీసుకొచ్చిన వీజీటీఎం పరిధిలో ఉంటుందా.. లేక శివరామకృష్ణన్ కమిటీ సూచించిన ప్రాంతాలను తాకుతుందా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. క్లుప్తంగా విజయవాడ పరిసరాలు అని ప్రకటించారు.

స్వాగతించిన జగన్

విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ప్రకటనను ప్రతిపక్ష నేత జగన్ స్వాగతించారు. కడప జిల్లాలో, ఇడుపుల పాయలో క్యాపిటల్ ఉండాలని తాను కోరుకోలేదన్నారు. అయితే సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రకటన చేస్తున్నారనేదే తమ ఆవేదన అని చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం 30వేల ఎకరాల భూమి కావాలన్నారు. రాజధాని అంటే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  capital  chandrababu naidu  vijayawada  

Other Articles