Case filed against revanth reddy

revanth reddy, revanth reddy comments on kcr, ktr, trs, tdp, telangana, medak by poll, latest news, case on revanth reddy, banjara hills, ipc, ipc section 504, ipc section 505, nampally court

case filed against revanth reddy in banjarahills police station : with pitition of a lawyar court ordered banjara hills police to file case against revanth reddy

కేసీఆర్ ను తిడితే కేసులకు కొదువా !!

Posted: 09/02/2014 03:31 PM IST
Case filed against revanth reddy

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అనేది ఒకప్పటి సామెత. ఇప్పుడు ఇదే సామెతను కేసీఆర్ ను తిడితే కేసులకు కొదువా !! అని మార్చుకోక తప్పదు. ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే చాలు వెంటనే నేతల ఇళ్ళకు నోటిసులు వెళ్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా చూశాం. తాజాగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఈ వరుసలో చేరారు. కేసీఆర్ ను తిట్టినందుకు కేసు పాలయ్యారు.

ఓ మెడికల్ కాలేజి వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ తో పాటు పలువురికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై చర్యలు తీసుకోవాలని గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు టీడీపీ నేతపై కేసు పెట్టాలని బంజారాహిల్స్ పోలిసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డిపై ఐపీసీ 504 ( ఉద్దేశ్యపూర్వకంగా నిందించటం ) ఐపీసీ 505 ( కించపర్చేలా మాట్లాడటం ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే రేవంత్ అభియోగాలపై విచారణ జరిపి కోర్టుకు నివేదిక అందిస్తామని బంజారాహిల్స్ పోలిసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేసినందుకే రేవంత్ పై కేసు పెడతారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో నిత్యం టీఆర్ఎస్ నేతలు అనేక విమర్శలు చేస్తున్నా వారిపై ఎవరూ ఫిర్యాదులు చేయరు.. కేసులు పెట్టరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  nampally court  police case  

Other Articles