Kishan reddy fires on trs

kishan reddy, bjp, telangana, andhrapradesh, jagga reddy, kcr, trs, medak bypoll, konda sureka, majlis, mim, asaduddin, assembly, telugu, elections, political news, latest news

kishan reddy fired on trs accuses for recruting telangana opposed leaders : kishan reddy answer for incubing jagga reddy into trs accuses rose party activities

మూడు పార్టీలు మారితే ముద్దుపెట్టుకున్నారు !!

Posted: 09/02/2014 01:35 PM IST
Kishan reddy fires on trs

మెదక్ ఉపఎన్నిక పుణ్యమా అని తెలంగాణలో రాజకీయ పార్టీల మద్య మళ్లీ మాటల యుద్ధం మొదలయింది. బహిరంగ ప్రచారాలకు సిద్దమవుతున్న నేతలు.., పార్టీ కార్యాలయాల్లో ప్రాక్టిస్ మ్యాచ్ ఆడుతున్నారు. పొరుగు పార్టీలను తిట్టిపోయటంపై ఫోకస్ పెట్టారు. నేతల చేరికల అంశంగా విమర్శలు మొదలు పెట్టారు. జగ్గారెడ్డిని చేర్చుకోవటంపై దుమారం రేపుతున్న టీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి గట్టి జవాబిచ్చారు. గులాబిదళం గురివింద కింద నలుపు చూసుకుని మాట్లాడాలన్నారు. జగ్గారెడ్దికి టికెట్ ఇస్తే భూమి బద్దలయినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఉద్యమం సమయంలో వైసీపీలో ఉండి తెలంగాణవాదులపై మానుకోటలో రాళ్ళ వర్షం కురిపించిన కొండా సురేఖను కారు ఎక్కించుకున్నపుడు టీఆర్ఎస్ నీతి ఏమయిందని ప్రశ్నించారు. అదే విధంగా రాయలసీమ కోసం పట్టుబట్టిన మజ్లిస్ నేతలతో కలిసి తిరుగుతున్నారు. దీన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. తాము చేస్తే తప్పు.., టీఆర్ఎస్ చేస్తే ఒప్పయిందా సమాధానం చెప్పాలని గులాబీ దళాన్ని నిలదీశారు. టీఆర్ఎస్ కు ఒక నీతి.., ఇతర పార్టీలకు మరో నీతి సరైన విధానమా కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఒకే రోజు మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటే తప్పు లేదు కదా అని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ లో చేరితే పవిత్రులు.., బీజేపీలో చేరితే పాపాత్ములు అనే విధంగా కేసీఆర్ వరగ్ం గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. జగ్గారెడ్డికి తెలంగాణ ప్రజలు మెదక్ పగ్గాలు అప్పగించటం ఖాయంగా కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ తీసుకురావటంలో చొరవచూపినా రాష్ర్టంలో బీజేపి ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చాటుకోవాలనుకుంటోంది. అనూహ్యంగా జగ్గారెడ్డి కమలం జెండా పట్టి.., మెదక్ నుంచి పోటికి దిగుతున్నారు. 13న జరిగే ఉప ఎన్నికకు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishan reddy  trs  jagga reddy  latest news  

Other Articles