Jagan mohan reddy cheated some people by saying that he is relative to former minister kirankumar reddy

jagan mohan reddy, former cm kiran kumar reddy, kiran kumar reddy latest news, jagan mohan reddy kiran kumar reddy, former cm kiran relative, jagan mohan reddy cheater, jobs

jagan mohan reddy cheated some people by saying that he is relative to former minister kirankumar reddy

మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా వేసిన జగన్!

Posted: 09/02/2014 10:53 AM IST
Jagan mohan reddy cheated some people by saying that he is relative to former minister kirankumar reddy

(Image source from: jagan mohan reddy cheated some people by saying that he is relative to former minister kirankumar reddy)

విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రారాష్ట్రానికి కాంగ్రెస్ పుణ్యమా అని మూడేళ్లకు పైగా సీఎం పదవీ బాధ్యతలను చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ గుర్తుండే వుంటారు! ‘‘సమైక్యాంధ్ర’’ పేరుతో పార్టీ పెట్టుకుని తాను రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిపోదామనుకున్నారు కానీ.. అది సాధ్యపడలేదులెండి! దాంతో ఆయన అప్పటినుంచి పూర్తిగా కనుమరుగైపోయారు. రాజకీయంగాకానీ, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఆయన తెరమీద అస్సలు కనిపించనేలేదు. అయితే తాజాగా ఎవరో ఒక కేటుగాడు తాను ఈ మాజీ సీఎం బంధువునంటూ ఎస్ఐ, వీఆర్వో అభ్యర్థులను నిండా ముంచేశాడు. తాను సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో అభ్యర్థులకు నకిలీ అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. వీటిని చూయించి అతడు నిరుద్యోగుల నుంచి సుమారు రూ.55లక్షలు దండుకుని పరారయ్యాడు. దీంతో మోసపోయిన వారందరూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాడి అసలు రంగును బయటెట్టారు. అతడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బంధువు కాడని పోలీసుబాసులు తేల్చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. పీలేరు మండలం గ్యారంపల్లికస్ప గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి.. హైదరాబాద్ లోని లక్డీకాపూల్ లో రెండేళ్ల క్రితం ఒక ప్రైవేట్ కార్యాలయం తెరిచాడు. మరోవైపు కడప జిల్లాకు చెందిన విజయనర్సింహారెడ్డి, రైల్వే కోడూరుకు చెందిన నరేష్, చంద్రగిరికి చెందిన సుమతి ఎస్ఐ ఉద్యోగ పరీక్షలు రాశారు. అనంతరం వీరు ముగ్గురు ఉద్యోగాన్వేషణలో పూర్తిగా మునిగిపోయారు. దీంతో వీరిని గమనించిన నల్లకుంటలో వుండే రఘు అనే వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డి తన స్నేహితుడని.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అతనికి బంధువని.. అతను ఎస్ఐ పోస్టులు ఖచ్చితంగా ఇప్పిస్తాడని ఆ ముగ్గురితో నమ్మబలికాడు. ఉద్యోగ వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయిన ఆ ముగ్గురు... రఘు చెప్పిన మాటలను నమ్మేశారు. దీంతో రఘుతో కలిసి ఆ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరుకున్నారు.

2013లో వారందరూ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అయితే అతడు ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్ గా వారినుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. అలాగే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇతరుల నుంచి కూడా సుమారు రూ.33 లక్షలుమేర డబ్బులు దండుకున్నాడు. అనంతరం ఎస్ఐ అభ్యర్థులుగా సెలెక్ట్ అయినట్లు సీఎం కార్యాలయం పేరుపై ఎస్ఐ అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాడు. దీంతో ఎస్ఐ అభ్యర్థులందరూ తమకు ఉద్యోగాలొచ్చాయన్న సంతోషంలో మునిగిపోయారు. కానీ తీరా చూస్తే అవి నకిలీవని తెలిసిపోయాయి. దీంతో సదరు అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని డబ్బులకోసం నిలదీయగా.. అతడు ఎవ్వరికీ తెలియకుండా మరుసటిరోజు తన కార్యాలయాన్ని ఖాళీ చేసి పరారయ్యాడు. తాము నిండామోసపోయామని తెలుసుకున్న అభ్యర్థులు నిందితుడిపై నగర్ సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్ కేసు కింద దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో వున్నాడు.

ఇదిలావుండగా.. చిత్తూరుకు చెందిన మురళికి తాను కారు విక్రయిస్తానని రూ.2 లక్షలు తీసుకుని ఉడాయించాడని.. డాక్టర్ పోస్ట్ ఇప్పిస్తానని రైల్వే కోడూరుకు చెందిన హెడ్ మాస్టర్ సుబ్బరాయుడు నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్టు వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు మన టీవీ ఛానెళ్లలో ఒకటికీ పదిసార్లు ఇతరులను అంత సులభంగా నమ్మకండిరా బాబూ.. అంటూ రకరకాల అడ్వర్టయిజ్ మెంట్లద్వారా నిత్యం చూపిస్తున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఇంకా చైతన్యం వచ్చినట్లు కనిపించడం లేదు. పైగా ఇటువంటి ఆకతాయిలు కూడా భయం లేకుండా తిరగడం గమనార్హం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : former cm kiran kumar reddy  jagan mohan reddy  jobs  money  

Other Articles