Wife and children tortured to a retired police officer for money

retired police officer, police villains, bangalore crime news, retired police officer venkatesh, police crime news

wife and children tortured to a retired police officer for money : a retired police officer tortured for many days by his wife and children for not given his money to them

పోలీస్ పాలిట విలన్లుగా మారిన భార్యాబిడ్డలు!

Posted: 09/01/2014 11:20 AM IST
Wife and children tortured to a retired police officer for money

(Image source from: wife and children tortured to a retired police officer for money)

సాధారణంగా మనం సినిమాల్లో పోలీస్ బాస్ లు విలన్లను ఏ విధంగా తరిమితరిమి కొడతారో మనం చూస్తూనే వుంటాం! నిజజీవితంలో ఇటువంటి సంఘటనలు అంతగా ఎక్కువగా జరగకపోయినప్పటికీ.. ఎవరో ఒకరు విలన్ మాత్రం వారికి ఖచ్చితంగా వుండేవుంటారు. అయితే ఇక్కడ ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి మాత్రం భార్యాబిడ్డలే తనకు విలన్లుగా మారిపోయారు. తాను ఎన్నోఏళ్లతరబడి కష్టానష్టాలు అనుభవించి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఆ పోలీసు అధికారికి.. పదవీ విరమణ తర్వాత తన కుటుంబమే తనకు శత్రువుగా మారుతుందని ఏనాడు అనుకోలేదు. అతనిని ఒక ఖైదీలా బందీగా చేసి పడేసి, సరిగ్గా ఆహారం కూడా పెట్టకుండా నిత్యం చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి బెంగుళూరులో వెలుగుచూసింది.

బెంగుళూరుకు చెందిన వెంకటేష్ (60) అనే ఒక వ్యక్తి పోలీస్ శాఖలో 35 ఏళ్లపాటు పనిచేసి రిటైరయ్యారు. ఎన్నో కష్టనష్టాలు అనుభవించి కుటుంబసభ్యలకు ఏ కొరత లేకుండా మంచిగానే చూసుకున్నాడు. కొడుకులకు పెద్దపెద్ద చదువులే చదివించాడు. దాంతో వాళ్లు హెచ్ పీ, ఇన్ఫోసిస్ వంటి సంస్థల్లో పనిచేస్తున్నారు. అతను పదవిలో వున్నంతకాలం అంతా సాఫీగానే జరిగింది. అయితే పదవీవిరమణ సందర్భంగా అతనికి రూ.20 లక్షలు లభించాయి. అంతే! కుటుంబసభ్యుల కన్న ఈ డబ్బుపై పడింది. ఆ సొమ్ము తమకు ఇవ్వాల్సిందేనని భార్య, కొడుకులు నిత్యం వేధించడం మొదలుపెట్టారు.

అయితే ఆయన మాత్రం ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో వారిలో దాగివున్న రాక్షసత్వం బయటపడింది. వెంకటేష్ ను ఒక మంచానికి కట్టేసి, గదిలో పడేసి తాళం వేసేశారు. ఎప్పుడో ఒకప్పుడు కాసింత భోజనం అతనికి ఇచ్చేవారు! దాంతో ఆ వ్యక్తి ఆకలితో మలమల మాడిపోయేవాడు. తనను విడిచిపెట్టాల్సిందిగా ఎంత వేడుకున్నా.. అతని కుటుంబసభ్యలు మాత్రం వినేవాళ్లు కాదు. ఆహారం లేకపోవడంతో ఆ వ్యక్తి నీరసంగా మారిపోయినప్పటికీ భార్యాబిడ్డలకు మాత్రం అతనిప జాలి కలగలేదు. తమకు డబ్బులిచ్చేంతవరకు వదిలిపెట్టేది లేదని వారు మొండికేసేవారు. కానీ వెంకటేష్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని వాదిస్తుండటంతో అతనిని అలాగే వదిలేశారు.

ఇదిలావుండగా.. తన అన్న కనిపించడం లేదని వెంకటేష్ తమ్ముడికి అనుమానం వచ్చి ఆరాతీశాడు. వెంకటేష్ స్నేహితులు, బంధువులతో అతని తమ్ముడు సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. చివరికి అతడి అనుమానం తన అన్న కుటుంబసభ్యలపైకి మళ్లింది. మరేమీ ఆలోచించకుండా అతను నేరుగా కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో, సెర్చ్ వారంట్ తో పోలీసులు వచ్చి ఇంట్లో వెతకగా.. సదరు భార్యాబిడ్డలు చేసిన నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం వారు కటకటాల వెనక్కి చేరారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore crime news  retired police officer crime  assets  villains  

Other Articles