Chandrababu will have sleepless nights in future

chandrababu naidu, ap cheif minister, ap cabinet, andhrapradesh, congress, aicc, inc, chiranjeevi, ap congress, telangana, balakrishna, kakinada, latest news, politics, babu promises

chiranjeevi says chandrababu naidu will have sleepless nights in future : babu given impossible promises to people of ap it will get sleepless to him says chiranjeevi

కాపులకు చంద్రబాబు ఏం చేశారు - చిరంజీవి

Posted: 08/31/2014 04:50 PM IST
Chandrababu will have sleepless nights in future

చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సెటైర్లు విసిరారు. ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చిన బాబుకు కష్టకాలం మొదలయిందన్నారు. హామిలు ఎలా అమలు చేయాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. హామిలను తలచుకుంటూ బాబు ఇకపై నిద్రలేని రాత్రులు గడుపుతారని ఎద్దేవా చేశారు.

రైతులకు రుణమాఫీ చేయకుంటే గత టీడీపీ పాలనలో జరిగిన రైతుల ఆత్మహత్యలు తిరిగి పునరావృతం అవుతాయన్నారు. కాబట్టి చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలకు టిడిపినే బాధ్యత వహించాలన్నారు. వ్యవసాయ రుణాలంటూ వాటిని పంటరుణాలుగా మార్చారని మండిపడ్డారు.

కాపులకు ఏం చేశారు?

ఇక ఎన్నికల సమయంలో కాపులను ఆదుకుంటామని, వారికి బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేస్తామన్న ముఖ్యమంత్రి మాట తప్పారని చిరంజీవి ద్వజమెత్తారు. ఎన్నికల ముందు కొండంత అని చెప్పి బడ్జెట్ లో మాత్రం గోరంత కేటాయించారని విమర్శించారు. బాబుకు కాపుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఇలా చేసేవారు కాదన్నారు. బడ్జెట్ పై కాపుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చిరంజీవి అన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  chandrababu  latest news  elections  

Other Articles