Tensions in pakisthan continues with imran khan protests

pakisthan, imran khan, pti, nawaz sharif, pakisthan news, police, islamabad, hyderabad, protests, movements, world news, latest news, pm, narendra modi

tensions in pakisthan continues as imran khan serial protests : protest against nawaz sharif become serious, several injured in police attacks

పాక్ ను వణికిస్తున్న ఇమ్రాన్ ఖాన్

Posted: 08/31/2014 02:02 PM IST
Tensions in pakisthan continues with imran khan protests

అల్లర్లతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. షరీఫ్ సర్కారుకు వ్యతరికంగా వరుసగా జరుగుతున్న నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తుండటంతో వందల సంఖ్యలో నిరసనకారులు గాయాలపాలవుతున్నారు. అయినా సరే దాడులను ఎదుర్కుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారు. షరీఫ్ ఇంటి దిశగా దూసుకెళ్ళేందుకు ప్రయత్నించగా నిరసనకారరులను అరెస్టు చేశారు.

అటు గత రాత్రి జరిగిన ఆందోళనల్లో మూడు వందల మందికి పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. ఎన్ని దాడులు జరిగినా తమ పోరాటం ఆగదని పీటీఐ స్పష్టం చేస్తోంది. నవాజ్ షరీఫ్ గద్దె దిగాలని డిమాండ్ చేస్తోంది. అప్పటివరకు ఎన్ని పోరాటాలైనా చేస్తాం. ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ప్రధానిగా నవాజ్ షరీఫ్ పాక్ అభివృద్ది కోసం చేసిందేమి లేదని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ విమర్శిస్తున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించలేని ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్టీ, మద్దతుదారులు ఆందోళనలు చేపడుతున్నారు. గత పదిహేను రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. దాదాపు వెయ్యి మంది వరకు ఈ నిరసనల్లో గాయపడ్డారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakisthan  nawaz sharif  imran khan  latest news  

Other Articles