Husband harases wife by blackmailing with her blue videos

husband, wife, woman harasment, husband harasment, latest news, hyderabad, uppal, balanagar, family relations, police, crimes, india, nude videos, blue videos, sex

husband harases wife with her blue videos by uploading in internet : husband blackmailed in uppal by blackmailing her blue videos

నగ్న వీడియోలతో భార్యను బెదిరించిన భర్త

Posted: 08/31/2014 01:54 PM IST
Husband harases wife by blackmailing with her blue videos

కట్టుకున్నవాడే క్రూరమృగం అయ్యాడు. భార్య నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో పెడతానని వేధించాడు. మృగాడి వేధింపులు భరించలేకపోయిన భార్య చివరకు పోలిసులకు ఫిర్యాదు చేసింది. బాలానగర్ కు చెందిన భాస్కర్ తో ఉప్పల్ లో ఉండే ఓ యువతికి ఆరు నెలల క్రితం పెళ్ళి అయింది. నెల రోజుల పాటు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మద్యా విభేదాలు వచ్చాయి. విడాకులు ఇవ్వాలని భాస్కర్ తీవ్రంగా ఒత్తిడి చేసినా భార్య భయపడలేదు.

భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించే యువతి భార్యగా వస్తుందని వేధించటం మొదలు పెట్టాడు. అయినా ఆమె మాట వినకపోవటంతో.., బెదిరింపులకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో నగ్నంగా ఉన్నపుడు సీక్రెట్ గా ఫొటోలు తీశాడు. వాటిని భార్యకు చూపించి.., బెదిరించటం ప్రారంభించాడు. విడాకులు ఇవ్వకుంటే ఆ ఫొటోలు, వీడియోలను తన స్నేహితులకు చూపించటంతో పాటు, ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు.

కట్టుకున్న భర్తే ఇలా చేయటం చూసి కుమిలిపోయిన యువతి, చివరకు వేధింపులు భరించలేక పోలిసులకు ఫిర్యాదు చేసింది. కంప్లయింట్ అందుకున్న పోలిసులు భాస్కర్ ను కటకటాల వెనక్కి నెట్టారు. సొంత భార్యనే అసహ్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న భాస్కర్ బుద్దిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband blackmailing  wife  hyderabad  videos  

Other Articles