Tummala nageswara rao resigns for tdp

tummala nageswara raorao, tdp, trs, kcr, cabinet, leaders, ministers, chandra babu naidu, latest news, telangana, andhrapradesh

tummala nageswara rao resigns tdp wrotes letter to chandrababu : tummala quits tdp will join in trs on september 5th

టిడిపికి తుమ్మల షాక్. కమ్మ వర్గాన్ని ఆకర్షిస్తున్న గులాబిదళం

Posted: 08/30/2014 06:07 PM IST
Tummala nageswara rao resigns for tdp

తెలంగాణలో తెలుగుదేశం పార్టికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజిమంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు గుడ్ బై చెప్పారు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతానని సంకేతాలిచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబుకు కూడా ఏక వాక్యంతో లేఖను పంపారు. అనుచరులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. రాజీనామా ప్రకటన సందర్బంగా తుమ్మల కంటతడి పెట్టుకున్నారు. తుమ్మల రాజీనామా తెలంగాణలో టీడీపికి షాక్ గా చెప్పవచ్చు.

ఖమ్మంలో టిడిపి ఖాళీ !

తుమ్మలతో పాటు ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు కొండబాల, ఎమ్మెల్సి బాలసాని, డిసిసిబీ చైర్మన్ మువ్వ విజయ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కవిత, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నాగ చంద్రారెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు, అనుచరులు కూడా పసుపు జెండా పక్కనబెట్టారు. ఈ దెబ్బతో జిల్లాలో టిడిపి ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో కొద్దికాలంగా నామా నాగేశ్వర రావు వర్గం, తుమ్మల వర్గంగా టిడిపి విడిపోయింది. ఈ తరుణంలో ఒక వర్గం పూర్తిగా టిడిపిని వీడటంతో ఇక జిల్లాలో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో టిడిపి అధికారంలో లేదు కాబట్టి పదవులు ఆశిస్తున్న, ద్వితియ స్థాయి నేతలు కూడా త్వరలో కారెక్కే సూచనలు కన్పిస్తున్నాయంటున్నారు.

ఆకర్ష్ కమ్మ రంగంలోకి కేసీఆర్

తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా నాటుకుపోయింది. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణలో ప్రభంజనం సృష్టించింది. అయితే ఖమ్మ జిల్లాలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి కారణం అక్కడ ఉన్న సెటిలర్లతో పాటు ఖమ్మ సామాజిక వర్గం. దీంతో ఈ వర్గం ఓట్లను పొందేందుకు తుమ్మలను టీఆర్ఎస్ ఆకర్షించింది. కుటుంబ సభ్యులతో పని జరగకపోవటంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్లు పార్టీవర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మలను త్వరలోనే ఎమ్మెల్సి చేయటంతో పాటు, మంత్రి పదవి ఇస్తానని తెలంగాణ సీఎం ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో తుమ్మల గులాబి కండువా కప్పుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

తుమ్మల చేరికతో జిల్లాలోని కమ్మ సామాజిక వర్గ ఓట్లు టీడీపీ నుంచి టీఆర్ ఎస్ కు చీలనున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడు సార్లు, ఖమ్మం (2009) నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సెప్టెంబర్ 5న తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో తుమ్మల టీఆర్ఎస్ తీర్థం పుచ్చకుంటారని తెలుస్తోంది.

పట్టు కోల్పోతున్న టిడిపి

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంగా పరిమితం అయింది. మారుతున్న పరిస్థితులు, సమీకరణాలు పార్టీ బలాన్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆర్.కృష్ణయ్య పార్టీకి దూరంగా ఉన్నారు. మోత్కుపల్లి కూడా అంతగా పట్టించుకోవటం లేదు. ఇక మిగిలింది ఎర్రబెల్లి, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి వంటి నేతలు మాత్రమే. వీరు మాత్రమే టీ.టీడీపీలో మీడియా ముందు ఎక్కువగా కన్పిస్తున్నారు. తెలంగాణపై బాబు అనుసరించిన వైఖరి వల్లే తమ పార్టీ అధికారంలోకి రాలేదని చాలామంది తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలు స్పష్టతతో ఉంటే తమ అధినేత మాత్రం మరొకలా మాట్లాడి తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేతలకు టీఆర్ఎస్ ఆకర్ష్ ను అందిస్తోంది. ఇదే జరిగితే క్రమంగా టీటీడీపీ పరిమిత నేతల పార్టీగా మారే ప్రమాదముంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tummala nageswara rao  tdp  trs  latest news  

Other Articles