Isis terrorists cruelty in iraq

isis terrorists, iraq, terrorists, islamic state, cruel attacks, soldiers, syria soldiers dead, killings, us journalist beheaded, america, latest news, parade, nude, world news

isis terrorists cruelly killed 250 syria air base soldiers : isis terrorists captured syria air base terrorists and done parede in nude killed them cruelly

సైనికుల బట్టలూడదీసి పరిగెత్తించిన తీవ్రవాదులు

Posted: 08/30/2014 02:59 PM IST
Isis terrorists cruelty in iraq

ఇరాక్ లో తీవ్రవాదుల ఆగడాలకు, ఆకృత్యాలకు అడ్డులేకుండా పోతుంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. చాలా పట్టణాలను గుప్పిట్లో పెట్టుకున్న టెర్రరిస్టులు ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న సైనికులను టార్గెట్ చేసుకున్నారు. సిరియాకు చెందిన 250మంది ఎయిర్ బేస్ సైనికులను దారుణంగా వరుసపెట్టి కాల్చి చంపారు. సైనికులను బంధీలుగా పట్టుకున్న తీవ్రవాదులు, ఎడారి ప్రాంతంలో వారి బట్టలూడదీసి పరేడ్ చేయించారు. పరేడ్ చేస్తుండగానే.., తుపాకులతో కొట్టారు.

అంతటితో ఆగకుండా అందర్నీ వరుసపెట్టి కాల్చి అతి దారుణంగా సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. వారి రాక్షసత్వాన్ని ఇక్కడితో ఆపకుండా ఈ వీడియోను నెట్ లో పెట్టి.., తాము చంపిన సైనికుల సంఖ్య 250కి చేరిందని పోస్ట్ చేసింది ఉగ్రవాద సంస్థ. ఈ వీడియోలో ఉగ్రవాదుల పాశవిక చర్యలు చూసిన ప్రపంచం ఒక్కసారిగా వణికిపోయింది. దేశాన్ని కాపాడే సైనికుల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే ఇక సామాన్యులు ఇరాక్ లో ఎలా ఉంటారో అని ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రవాదులు డిమాండ్ల కోసం ఇలా దారుణాలకు పాల్పడటాన్ని అందరూ ఖండిస్తున్నారు.  

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis terrorists  soldiers killing  nude parade  latest news  

Other Articles