Jaggareddy surrunders before court

jagga reddy, turpu jayaprakash reddy, jaggareddy joined bjp, jaggareddy on kcr, bjp, medak by poll, telangana, trs, lateste news, court, assultation case, surrunder, warrant

bjp medak mp candidate jaggareddy surrunders before court : jaggareddy surrunders before court in assultation case

కోర్టులో లొంగిపోయిన జగ్గారెడ్డి

Posted: 08/30/2014 02:56 PM IST
Jaggareddy surrunders before court

పార్టీ అధినేతలకు సైతం తన విమర్శలతో పక్కలో బల్లెంలా ఉండే జగ్గారెడ్డి చేతులు కట్టుకున్నారు. కమలదళంలో చేరిన ఈ నేత కోర్టు మెట్లు ఎక్కారు. రెండు కేసుల్లో జగ్గారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. 2011-12సంవత్సరంలో సదాశివపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో  రేషన్ బియ్యం బాగా లేవని నర్సింహ్ములు అనే వ్యక్తి ఆరోపించారు. దీంతో కోపంతో ఊగిపోయిన అప్పటి సంగారెడ్డి ఎమ్మెల్యే.., నర్సింహ్మలుపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో పోలిసులు కేసు నమోదు చేశారు. ఇవాళ జరిగిన విచారణకు జగ్గారెడ్డి స్వయంగా హాజరయ్యారు.

ఇక 2012లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో సమైక్య కామెంట్లు చేసినందుకు జగ్గారెడ్డి కాన్వాయ్ ను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. వీరిపై కూడా జగ్గన్న దాడికి దిగటంతో.., ఈ ఘటనలో కూడా కేసు నమోదయింది. ఈ రెండు దాడి కేసుల్లో నిందితుడుగా ఉన్న జగ్గారెడ్డి కోర్టుకు హాజరై లొంగిపోయినట్లు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న తెలిపారు. చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. జగ్గారెడ్డి ఎంపికతో బీజేపిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ కోర్టు చిక్కులు కమలంను ఇరుకున పెట్టేందుకు ప్రత్యర్ధులకు మరింత ఉపయోగపడతాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaggareddy  court  medak by poll  latest news  

Other Articles