Case filed on director puri jagannath

puri jagannath, puri jagannath movies, latest news, mahesh babu, raviteja, puri, telugu news, tollywood news, latest updates, directors, land case, ccs police, hyderabad, buildings, land, flats, bail, nampally court

case filed on director puri jagannath in land buying issue : hyderabad ccs police filed case against puri jagannath and his wife in land buying case

పూరిజగన్నాధ్ పై సీసీఎస్ పోలిసుల కేసు

Posted: 08/30/2014 09:18 AM IST
Case filed on director puri jagannath

తెలుగు సినీ ఇండస్ర్టీలో విభిన్నమైన కధలతో సినిమాలు తీసే జగన్నాధ్ కష్టాల్లో చిక్కుకున్నారు. దర్శకుడిపై పోలిసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైం స్టేషన్ పోలిసులు పూరిపై కేసు పెట్టారు. ఆరేళ్ళ క్రితం జూబ్లిహిల్స్ లో ఓ స్థలం కొనేందుకు బ్యాంకు రుణం తీసుకున్నారు. ఇప్పుడా అప్పే ముప్పు తెచ్చింది. అప్పును ఇంతవరకు తీర్చకపోవటంతో పాటు.., ఈ స్థలంపై వివాదం కూడా ఏర్పడింది. ఇదిలా ఉండగానే అప్పు చెల్లించకపోవటంతో పూరితో పాటు ఆయన భార్య లావణ్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

అరెస్టు చేస్తారన్న అనుమానంతో పూరి జగన్నాధ్ ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించారు. గురువారం నాంపల్లి కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సోమవారం వరకు కోర్టు పూరికి బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత పరిణామాలు పరిశీలించి స్పందిస్తామని స్పష్టం చేసింది. దీంతో సోమవారం తర్వాత ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలయింది.  ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని పూరి ఫ్యామిలీ తీవ్రంగా ఆలోచిస్తోంది.

అటు పూరి జగన్నాధ్ మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రాజు అనే వ్యక్తితో పాటు మరో బిల్డర్ తనను మోసం చేశారని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ తీసుకున్న పోలిసులు.., ఆధారాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధర్శకులు తమ సినిమాలు, కధల విషయంలో కేసులు నమోదైన సందర్బాలున్నాయి. కాని ఇలా భూ వివాదాలు, అప్పుల కేసుల్లో ఇరుక్కున్నవారు చాలా తక్కువ. అప్పు ఎప్పటికైనా ముప్పు అన్నట్లు.., ఇప్పుడది పూరి నెత్తికెక్కి కూర్చుంది. ఈ బరువు త్వరగా దిగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri jagannath  nampally court  ccs police  latest news  

Other Articles