Pm narendra modi wishes happy vinayaka chavithi to indian people on twitter

pm narendra modi, narendra modi latest news, narendra modi twitter account, narendra modi vinayaka chavithi, narendra modi tweet, narendra modi latest press meet

pm narendra modi wishes happy vinayaka chavithi to indian people on twitter

గణనాథుడి మీద ప్రధాని మోడీ ‘పిట్ట’ సంచలనం!

Posted: 08/29/2014 12:11 PM IST
Pm narendra modi wishes happy vinayaka chavithi to indian people on twitter

(Image source from: pm narendra modi wishes happy vinayaka chavithi to indian people on twitter)

నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత తన ‘పిట్ట’ను మరింత వేగంగా నడుపుతున్నట్టు తెలుస్తోంది. ‘పిట్ట’ అంటే అర్థం కావడం లేదు కదూ! అదేనండి.. మన సెలబ్రిటీలందరూ టైంపాస్ అవక ఏదో ఒకటి కామెంట్ పోస్ట్ చేస్తుంటారు కదా.. అదే ‘‘ట్విటర్’’ అకౌంట్! దీనిక్కూడా ఇతర వెబ్‌సైట్‌లకు వున్న సింబిల్స్‌లాగే ‘‘పిట్ట’’ గుర్తుగా వుంటుంది. సెలబ్రిటీల సంగతి అటుంచితే.. దేశ రాజకీయనేతల్లో నరేంద్రమోడీ ఒక్కరే ఈ ట్విటర్‌లో నిత్యం ఏదో ఒకటి పోస్ట్ చేసి, సంచలనం సృష్టిస్తున్నారు. అన్నట్టు ఏ రాజకీయ నాయకుడికి లేనంత ట్విటర్ ఫాలోయింగ్ మోడీకి హై రేంజ్‌లోనే వుంది.

ఇదిలావుండగా.. తాజాగా నరేంద్రమోడీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వినాయక చతుర్థి రోజున మనమంతా ప్రథమ పూజితుడని కొలుస్తాం. లంబోదరుడి ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. మన జీవితాలు శాంతి, సౌఖ్యం, వివేకాలతో వర్థిల్లేల్లా గణనాథుడు చల్లని చూపుతో దీవెనలు అందిస్తాడు’’ అంటూ ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అంతే! మోడీ ట్విటర్ ఫాలోయింగ్ తెలుసు కదండి.. ఆయన ట్వీట్ చేసిన వెంటనే కొన్ని వేలమంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ రిట్వీట్ చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా ఈ విషయమై ట్వీట్ చేసినప్పటికీ వారికి అంతగా రెస్సాన్స్ రాలేదు కానీ.. మోడీకి మాత్రం అనూహ్యంగా స్పందన లభిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  vinayaka chavithi  twitter  

Other Articles