Telangana cm kcr orders to ban rape and bedroom scenes in movies and serials

telangana cm kcr, cm kcr, kcr latest news, kcr anurag sharma, kcr latest news, kcr fires movies, kcr latest press meet, kcr anurag sharma news, kcr movies, kcr serials, tollywood movies, rape scenes in movies, bedroom scenes in movies, dgp anurag sharma

telangana cm kcr orders to dgp anurag sharma to send him report how to take actions on rape and bedroom scenes in movies and serials

సినిమా - సీరియల్స్‌పై కన్నెర్రజేసిన సీఎం కేసీఆర్!

Posted: 08/29/2014 11:35 AM IST
Telangana cm kcr orders to ban rape and bedroom scenes in movies and serials

(Image source from: telangana cm kcr orders to ban rape and bedroom scenes in movies and serials)

గతంలో తమ రేటింగ్స్‌ను పెంచుకోవడం కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని న్యూస్ పేపర్ల మీద కేసీఆర్ కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే! అలాగే ఆమధ్య తెలంగాణ నాయకులను, మంత్రులను కించపరిచే విధంగా ప్రసారాలు చేశారని టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్లమీద ఆంక్షలు కూడా విధించారు. అలాగే తనకు సంబంధం లేని విషయాల మీద న్యూస్ ప్రచురించిందని ఆయన టైమ్స్‌ఆఫ్‌ఇండియా వంటి జాతీయ డైలీ న్యూస్‌పేపర్‌పై ఆగ్రహాన్ని వెళ్లగక్కిన సంగతి విదితమే! ఇప్పుడు తాజాగా ఆయన సినిమా, సీరియళ్ల మీద కన్నెర్రజేశారు.

ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఆకృత్యాలకు.. సినిమాల్లో, సీరియల్స్‌లో చూపించే హింసాత్మక దృశ్యాలే ఒక కారణమంటూ సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. మహిళలపై హింసాత్మక దృశ్యాలను, దురాగతాలను చిత్రీకరించి చూపించే సినిమాలు, సీరియల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇటువంటి హింసాత్మక సన్నివేశాలను చూడటం వల్లే యువతుల్లో నేరప్రవృతి హద్దులేకుండా మితిమీరిపోతోందని.. చివరికి చిన్నపిల్లల సైతం అన్యాయాలకు ఒడిగడుతున్నారని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కేసీఆర్ మహిళలపై హింసాత్మకంగా కంటెంట్ ఉండే సీరియల్స్, సినిమాలపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో అధ్యయనం చేసి.. తనకు నివేదించాలని డీజీపీ అనురాగ్ శర్మను ఆదేశించారు. ఇకపై వచ్చే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు లేకుండా సినిమా, సీరియళ్లు చిత్రీకిరించాలని... ఇలాకాని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే రీతిలో ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  dgp anurag sharma  telugu movies  telugu serials  bedroom scenes  

Other Articles