Shahrukh khan brand ambassador to interpoll agency

shahrukh khan, shahrukh khan latest news, shahrukh khan interpoll, shahrukh khan interpoll brand ambassador, interpoll brand ambassador, shahrukh khan movies, action hero jackie chan, soccer star lionel messey, formula 1 racer fernando

shahrukh khan brand ambassador to interpoll agency : the bollywood baadshah is elected as brand ambassador for interpoll agency for campaign worldwide against the crimes

నేరగాళ్లను క్లాస్ పీకుతున్న షారుఖ్ ఖాన్!

Posted: 08/28/2014 12:31 PM IST
Shahrukh khan brand ambassador to interpoll agency

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానివెనుక ఏదో ఒక అర్థం ఖచ్చితంగా వుంటుంది. అలా వుంటేనే తాను కూడా సదరు ఒప్పందాలకు సై అంటానంటూ షారుఖ్ కూడా పలుమార్లు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎన్నోరకాల రివార్డులు, అవార్డులు, సత్కారాలు లభించాయి. తాను నటించబోయే సినిమానుంచి పబ్లిక్ ఫంక్షన్లలో డ్యాన్స్ చేసేంతవరకు అన్ని రంగాల్లోనూ పాలుపంచుకోవడంలో షారుఖ్ ఎప్పుడూ ముందుంటాడు. బాలీవుడ్ లో ఈయనకున్న ప్రత్యేక ఇమేజ్ ఏ హీరోకు వుండదు. అంతేకాదండోయ్.. ప్రపంచవ్యాప్తంగా గౌరవదగిన స్టార్లలో షారుఖ్ ఖాన్ ఎంతో అరుదైనవాడు! ఈయనకు ఇండియాలో కంటే విదేశాల్లో వచ్చిన అవార్డులే ఎక్కువ! ఈ విషయాలు పక్కనపెడితే.. షారుఖ్ ఖాన్ ఇకనుంచి నేరగాళ్లకు క్లాస్ పీకుతున్నట్టు సమాచారం!

నేరగాళ్లకు సింహస్వప్నంగా నిలిచే అంతర్జాతీయ సంస్థ ‘‘ఇంటర్ పోల్’’. ఎంతటి పెద్ద నేరమైనా దాని పునాదుల వరకు తవ్వి నేరస్తులను పట్టుకోవడంలో ఈ సంస్థ కీలకపాత్ర వహిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ వ్యతిరేక ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వున్న క్లాస్ సెలబ్రిటీలు నేరాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించనున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం మన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు వరించింది. ఇకనుంచి ‘‘ఇంటర్ పోల్’’ సంస్థకు షారుఖ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. అది బాద్షాకు వున్న క్రేజ్! మన బాలీవుడ్ లో దిగ్గజాలు ఎంతమంది వున్నప్పటికీ.. షారుఖ్ కు వున్నంత క్రేజ్ ను ఎవరూ సాధించలేకపోయారు.

ఇటువంటి అవకాశం లభించడంపై షారుఖ్ మాట్లాడుతూ.. ‘‘ఇంటర్ పోల్ అంబాసిడర్ గా ఎంపికవడం ఎంతో అరుదైన గౌరవం. మనమంతా కలిసి నేరాలను సమిష్టిగా ఎదుర్కోవాలి. అప్పుడే వాటిని అంతమొందించగలం’’ అంటూ పేర్కొన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ప్రచారంలో షారుఖ్ తోపాటు యాక్షన్ హీరో జాకీ చాన్ కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఈ ప్రచారంలో సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ, ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో, కిమిరైక్కోనెన్ తదితరులు భాగస్వాములయ్యారు. ఈ ప్రచార నేపథ్యంలో.. మాదకద్రవ్యాల రవాణా, మనుషుల అక్రమ తరలింపు, మోసాలు, సైబర్ నేరాలు, కిడ్నాప్ లు, బాలలపై నేరాలు వంటి అంశాలను ఇంటర్ పోల్ పొందుపరిచింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devotee from tamilnadu makes rs 180 crore offering lord venkateswara
Thane building collapse toll at 30 over 50 injured  
Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  bollywood super stars  interpoll  jackie chan  lionel messey  

Other Articles