Ice bucket challenge inventor corey griffin dies in sea adventure

ice bucket challenge, ice bucket challenge inventor, corey griffin, ice bucket challenge inventor corey griffin, corey griffin news

ice bucket challenge inventor Corey Griffin dies in sea adventure : the inventor of ice bucket challenge corey griffin died in another adventure

మరో సాహసం చేస్తూ మరణించిన ‘‘ఐస్ బకెట్’’ సృష్టికర్త!

Posted: 08/23/2014 11:04 AM IST
Ice bucket challenge inventor corey griffin dies in sea adventure

విదేశాల్లో వున్న సెలబ్రిటీల విషయం అటుంచితే... మన ఇండియాలో వున్న అగ్ర తారలందరూ ‘‘ఐస్ బకెట్ ఛాలెంజ్’’లో ఎలా భాగస్వామ్యం అవుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే! ఈ ఛాలెంజ్ ఒక్కసారి బయటపడిందో లేదో.. వరుసబెట్టి బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలో వున్న తారలందరూ ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ఛాలెంజ్ విషయం ఏమిటోగానీ.. ఇది యూట్యూబ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడంతో సెలబ్రిటీలు తమను తాము ప్రమోట్ చేసుకోవడం కోసమే దీనిని అడ్డం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. లేకపోతే ఏంటండి... నిన్నటిదాకా సైలెంట్ గా వున్న ఫ్లాప్ స్టార్లందరూ ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ పేరుతో యూట్యూబ్ లో తెగ తడిసిపోతున్నారు. మరికొంతమంది అయితే ఈ ఛాలెంజ్ లో విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తారు.

ఈ సెలబ్రిటీలు చేస్తున్న గోలను కొంచెం పక్కనపెడితే... ఈ ‘‘ఐస్ బకెట్ ఛాలెంజ్’’ను కనుగొన్న సృష్టికర్త ఎవరన్న విషయం చాలామందికి తెలియదు. నిజానికి ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ఒక పబ్లిక్ స్టంగా మారిపోయింది కానీ.. అసలు రహస్యం వేరే వుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అమీట్రోపిక్ లేటెరల్ సిరాసిస్ (ALS) అనే వ్యాధిని నిరోధించడం! ఈ భయంకరమైన వ్యాధి తన స్నేహితుడ్ని బాధిస్తోందని తెలుసుకున్న ఆ వ్యక్తి.. అతనిని ఆదుకోవడం కోసం వినూత్నంగా ఏదో చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కొన్ని పరిశోధనలను జరిపిన అనంతరం అతను ఈ ‘‘ఐస్ భకెట్ ఛాలెంజ్’’ను కనుగొన్నాడు. దీని సృష్టికర్త పేరు ‘‘కోరె గ్రిఫెన్’’. తన తెలివితేటలతో అందరినీ ప్రభావితం చేస్తూ... ఎంతోమందికి సహాయం చేసే గ్రిఫెన్.. తన స్నేహితుడిని కూడా సహాయం చేసేందుకు తన ప్రతిభను ఉపయోగించి దీనిని కనుగొన్నాడు.

ఇదిలావుండగా.. ఇంతగా ఫేమస్ చెందిన ‘‘ఐస్ బకెట్ ఛాలెంజ్’’ సృష్టికర్త తాజాగా చనిపోయాడు. ఇంకొక కొత్త పరిశోధన కోసం సాహసం చేస్తూ అతను తన ప్రాణాలను కోల్పోయాడు. మాసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఇతను డైవింగ్ ప్రమాదంలో చనిపోయాడు. ‘‘ఐస్ బకెట్ ఛాలెంజ్’’లాగే ఇంకొక ప్రయోగం కోసం ప్రత్యేకంగా సాహసం చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో.. గ్రిఫెన్ ఇలా సముద్ర సాహసంలో ప్రాణాలను కోల్పోయాడు. అతను ఎంతో పైనుంచి డైవింగ్ చేశాడని.. మొదట డైవింగ్ చేసిన వెంటనే ఇతను ఒకసారి బయటకు వచ్చాడని.. అనంతరం లోపలికి వెళ్లిన ఇతగాడు తిరిగి బయటకు రాలేదని అక్కడున్న ఒక వ్యక్తి మీడియా ప్రతినిధులతో వ్యక్తపరిచాడు. దీంతో ఇతని మరణవార్తను విన్న అందరూ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.

గ్రిఫిన్ మరణవార్తను విన్న అతని తండ్రి కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అతని గురించి మాట్లాడుతూ.. ‘‘స్నేహితుడి కోసం ప్రపంచాన్నే కదిలించలా నా కొడుకు ఒక గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు. దాంతో నాకు సంతోషంగా వుంది. అతని కొడుకుగా నేను గర్వపడుతున్నాను. ప్రపంచంలోనే అతను అత్యంత సంతోషకరమైన వ్యక్తి. ఇతరుల సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వుంటాడు’’ అంటూ అభివర్ణించాడు. తన స్నేహితుడి వైద్యం కోసం గ్రిఫిన్ కనుగొన్న ఈ ఛాలెంజ్ ద్వారా ఇప్పటికే దాదాపు లక్ష డాలర్ల వరకు డబ్బులను పొగేసుకున్నట్టు సమాచారం! అయితే ఆ సంతోషం అతనికి చాలాకాలం నిలవలేకపోయింది. అతని వయస్సు కేవలం 27 సంవత్సరాలే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles