Telangana govts controversial move on andhra bcs

telangana state, cm kcr, cm chandrababu naidu, andhra pradesh state, andhra bc people, bc association members, andhra pradesh bc association members, kcr bc, cm kcr controversial move on bc

Telangana Govt's controversial move on Andhra BCs : telangana cm kcr is going to take another controversial move on andhra pradesh state bc people

ఆంధ్రా బీసీల మీద పగపెంచుకున్న కేసీఆర్ ప్రభుత్వం!

Posted: 08/23/2014 10:42 AM IST
Telangana govts controversial move on andhra bcs

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పటివి కావు! 1956వ సంవత్సరంలో తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో కలిసినప్పటికీ నుంచి విభజన అయిన తర్వాత నేటి వరకు కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక విషయంపై యుద్ధం జరుగుతూనే వుంటోంది. నిన్నమొన్నటివరకు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదోపవాదనలు చేసుకున్న అనంతరం... గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవడంతో ఇద్దరూ సీఎంలు అధికారికంగా కలుసుకుని తమతమ సమస్యలను విశ్లేషించుకున్నారు. అందులో భాగంగానే వారిమధ్య ఇక ఘర్షణలు తలెత్తే సమస్యే లేదని... రాష్ట్రాలకు సంబంధించి ఏ సమస్యైనా తలెత్తితే దాన్ని కలిసి పరిష్కరిస్తామని ప్రకటించేసుకున్నారు. దీంతో రెండురాష్ట్రాల మధ్య వున్న విభేదాలు పూర్తిగా సమసిపోయాయనుకున్న తరుణంలో... తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.

తాజా పరిణామాల ప్రకారం చూస్తుంటే... కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రారాష్ట్ర బీసీ కులస్తుల మీద పగ పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రరాష్ట్రం నుంచి తెలంగాణాలో మకాం మార్చుకున్న ఆంధ్ర బీసీ ప్రజల మీద కేసీఆర్ వేటు వేస్తున్నారు. (ఆంధ్రరాష్ట్రానికి సంబంధించి చాలామంది ప్రజలు తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో సెటిల్ అయినవారున్నారు!) ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారి మీద వేటు వేస్తూ ఒక తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆంధ్రా రాష్ట్రం నుంచి వచ్చిన కొప్పుల, వెలమ, కళింగ, శెట్టి బలిజ, నగరలు, గవర, కాపు, తూర్పు కాపు వంటి తదితర కులాలతోపాటు మరో 19 కులాలకు చెందిన ప్రజలందరూ సాధారణంగా బీసీ క్యాస్ట్ కిందకు వస్తారు. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణాలో వున్న బీసీలందరూ ఓసీ కిందకు పరిగణించబడతారు.

పైన చెప్పిన విధంగా రకరకాల కులాలకు చెందిన ప్రజలు ఎవరైతే తెలంగాణాలో వున్నారో.. ఇప్పటినుంచి వారు ఓసీ కేటగిరి కిందకు పరిగణించబడతారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్ సందర్భంగా రిజర్వేషన్ కోటాలో అడ్మిషన్స్ లో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రా బీసీ అసోసియేషన్ సభ్యులందరూ దీనిమీద నిరసనలు వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయంపై ఆంధ్రా ప్రభుత్వంతోపాటు బీసీ అసోసియేషన్ సభ్యులందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉద్యమాలు చేపడ్డానికి రంగం సిద్ధం చేస్తున్నాయని సమాచారం! మరి ఈ వివాదం ఇంకెంత దుమారాన్ని రేపుతుందో..? ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించనుందో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles