Warangal farmers protesting against cm kcr on power cuts

cm kcr, telangana farmers, warangal farmers, farmers protesting, power cuts telangana, power problems telangana, telangana state news, power problems news, cm kcr farmers

warangal farmers protesting against cm kcr on power cuts : The farmers of warangal regions are protesting against power cuts problems in telangana. They demanding to supply them free power for 7 hours.

అయ్యా కేసీఆర్.. తెలంగాణాలో అభివృద్ధి ఎక్కడుందయ్యా!

Posted: 08/23/2014 10:15 AM IST
Warangal farmers protesting against cm kcr on power cuts

విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. ప్రపంచంలో గర్వించదగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నోసార్లు ప్రకటనలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో వున్న పేదలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని.. ఏవైతే లోపాలున్నాయో వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన హామీలు ఇచ్చారు. ఇక ముఖ్యంగా రైతులకు అయితే ఉచిత విద్యుత్ తోపాటు లక్షరూపాయల వరకు రుణమాఫీలు చేయిస్తామని ఆయన వాగ్ధానాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ హామీలను పూర్తి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారంటూ ఆయన్ను సీఎంను చేసిన ప్రజలే వెనుదిరుగుతున్నారు. ‘‘అయ్యా కేసీఆర్.. అభివృద్ధి ఎక్కడుంది?’’ అంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. కొన్నిప్రాంతాల్లో అయితే ఈయన దిష్టిబొమ్మను దహనం చేసి, రాస్తారోకో ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. ఎంత తీవ్రమంటే.. తమకు విద్యుత్ సరిగ్గా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయంటూ కొంతమంది రైతులు రోడ్డుమీద పడి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ‘‘అయ్యా.. మాకు సహాయం చేయండి’’ అంటూ తమ ఆవేదనలను వ్యక్తం చేస్తూ చేతులు చాస్తున్నారు. మొన్నీమధ్యే ఈ విద్యుత్ సమస్య మీద మెదక్ జిల్లాలోని ఒక ప్రాంతంలో రైతులు ఏకంగా జాతీయ రహదారిమీదే ఉద్యమం నిర్వహించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో రైతులు కేసీఆర్ బొమ్మను నడిరోడ్డులో దహనం చేస్తూ, నిరసనలు వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ వచ్చిన అనంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆ హామీలను ఎందుకు పూర్తి చేయడం లేదంటూ’’ వారు వాదనలను వినిపించారు.

ఆ సంఘటన ఇంకా చల్లారకే ముందే వరంగల్ ప్రాంతంలో వున్న రైతులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. తమకు విద్యుత్ కొరత చాలా తీవ్రమైందని.. దానివల్ల పంటలు చాలా నష్టపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ‘‘మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడు నెలలు అవుతోంది.. అయినా ఇంతవరకు రాష్ట్రాభివృద్ధికోసం ఏమీ చేయలేదు. కేసీఆర్ గారు.. మాకు కరెంట్ ఎక్కడుంది..? మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి..?’’ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘కేసీఆర్ రైతులకు 7 గంటల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ మాకు సరిగ్గా 3 గంటలవరకు విద్యుత్ లభించడం లేదు’’ అంటూ వారు పేర్కొంటున్నారు. తమకు ఎలాగైనా ఈ విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేలా చేయాలని... ఆయన ఇచ్చిన హామీమేరకు 7 గంటల ఉచిత విద్యుత్ ను అందించాల్సిందేనంటూ వారు ఉద్యమాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా... మరోవైపు కొంతమంది రాజకీయనాయకులు కూడా విద్యుత్ కొరత విషయంపై కేసీఆర్ మీద తీవ్ర విమర్శలను గుప్పించారు. ‘‘కేసీఆర్ ఇచ్చిన హామీలను మరిచిపోయారని.. కేవలం మాటలు తప్ప చేతలతో చేసి నిరూపించడం లేదని’’ ప్రత్యర్థ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ‘‘ఎన్నికల ముందు రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు నోరెందుకు విప్పడం లేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు తెలంగాణాలో విద్యుత్ సంక్షోభంతో కూరుకుపోతోంది.. ఇంతవరకు ఏ పథకాలను అమలు చేయలేదు.. తెలంగాణాలో అభివృద్ధి ఎక్కడుంది.. ఎప్పుడవుతుంది..? అంటూ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana farmers  power cuts  protesting  

Other Articles