Chiranjeevi latest interview on clashes with pawan kalyan

chiranjeevi latest interview, chiranjeevi pawan kalya, chiranjeevi birthday, chiranjeevi birthday celebrations, chiranjeevi pawan kalyan news, pawan kalyan latest news, pawan kalyan latest interview

chiranjeevi latest interview on clashes with pawan kalyan : tollywood megastar chiranjeevi finally clarifies the relationship with pawan kalyan in a latest interview

మమ్మల్ని విడదీసే దమ్ము ఎవరికీ లేదు!

Posted: 08/22/2014 06:54 PM IST
Chiranjeevi latest interview on clashes with pawan kalyan

(Image source from: chiranjeevi latest interview on clashes with pawan kalyan)

మెగాస్టార్-మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, పవర్ స్టార్-జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య సంబంధం చెడిందని మీడియాలో వార్తాకథనాలు ఇప్పటికీ వస్తూనే వున్నాయి. మెగా బ్రదర్స్ గా తెలుగు చిత్రపరిశ్రమలో పేరు సంపాదించుకున్న చిరు, పవన్ లు తమ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని సమస్యలు రావడం వల్ల విడిపోయారని... ఇంతవరకు వీరిద్దరు అధికారికంగా కలిసిన దాఖలాలు లేవంటూ ఎన్నో వార్తలొచ్చాయి. ఆమధ్య చిరంజీవి ‘‘ప్రజారాజ్యం’’ పార్టీని స్థాపించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే! అయితే కొన్నాళ్లతర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్.. తన అన్నతో దూరమైపోయాడు. ఇక అప్పటినుంచి వీరిద్దరు కలవడంగానీ, మాట్లాడుకోవడంగానీ ఎప్పుడూ జరగలేదు. అటువంటి దృశ్యాలు మీడియాకంట కూడా పడలేదు. దీంతో వీరు ఇక కలవరనే ప్రచారాలు వ్యాపించాయి.

అంతెందుకు.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా ఓపెనింగ్ సమయంలో ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ ఒకేచోట వున్నప్పటికీ.. ఒకర్నొకరు పలకరించుకోవడంగానీ... కలుసుకోవడంగానీ.. ఆఖరికి చూసుకోను కూడా చూసుకోలేదు. దాంతో వీరిద్దరి విడిపోయారనే అనుమానాలు బలపడిపోయాయి. ఇటీవలే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ జనసేన పార్టీని స్థాపించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. ఇక అంతే సంగతులు! ఈ మెగాబ్రదర్స్ వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగా తలబడటానికి సిద్ధమయ్యారంటూ ఒకటే వార్తలు! ఇన్నాళ్లు తెరవెనుక వున్న వీరిద్దరి ఫైట్.. ఇక రాజకీయాల ద్వారా తెరమీద చూడొచ్చు అంటూ సెటైర్లు వేసిన దాఖలాలూ వున్నాయి. ఈ వార్తల సారాంశం మీద తాజాగా చిరంజీవి ఒక వివరణ ఇచ్చుకున్నారు.

చిరంజీవి తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో కొద్దిపేపటి వరకు ముచ్చటించారు. ఇందులో భాగంగానే ఆయన తనకు, పవన్ కల్యాణ్ కు మధ్య వున్న సంబంధం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. ఇందులో భాగంగానే ఒక విలేకరి.. ‘‘పవన్ కల్యాణ్ మీకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారని భావిస్తున్నారా..?’’ అని అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెబుతూ.. ‘‘పవన్ నాకు వ్యతిరేకంగా పార్టీ పెట్టాడని నేను అనుకోలేదు. అతను పార్టీ పెట్టడమనేది నాకు ఒకరకంగా సపోర్ట్ గానే అనిపించింది. ఎందుకంటే.. అతను కూడా నాలాగే ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధితోనే పార్టీ పెట్టాడు. మా పార్టీలు వేరైనప్పటికీ మా లక్ష్యం మాత్రం ఒక్కటే! అందుకే అతను పార్టీ పెట్టినప్పుడు నేను హర్షం వ్యక్తం చేశాను’’ అంటూ ఆయన వెల్లడించారు.

మరో విలేకరి అడుగుతూ.. ‘‘పవన్ పార్టీ పెట్టిన తర్వాత మీకు, ఆయనకు దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరేం అంటారు..?’’ అని అడగగా.. దానికి చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు... ‘‘నేను, పవన్ కల్యాణ్ వేరే దారుల్లో వెళ్తున్న మాత్రాన.. ఒక తల్లి కడుపున పుట్టినవాళ్లం దూరమైపోతామా! వేర్వేరు పార్టీలో కొనసాగినా.. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఏ రాజకీయాలు మా మధ్య వున్న అనుబంధాన్ని విడదీయలేవు. అంత శక్తి ఎవరికి వుంటుంది. అతని ఇష్టానుసారం ఒక దారిలో వెళుతున్నాడు. నేను నా అభీష్టం ప్రకారం వేరొక దారిలో వెళ్తున్నా. అంతే!’’ అంటూ ఆయన తమ మధ్య వున్న అనుబంధం మీద ఒక స్పష్టత నిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. ‘‘మొన్నీమధ్యనే తన వదినకు ఆరోగ్యం బాగోలేదని మా ఇంటికి కూడా పవన్ వచ్చాడు. అప్పుడు మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం’’ అంటూ వివరణ ఇచ్చుకున్నారు.

‘‘మరి మీరిద్దరు విడిపోయినట్లు వస్తున్న వార్తల మీద మీరేమంటారు?’’ అంటూ ఒక మీడియా ప్రతినిధి ఆయన్ను ప్రశ్నించగా... ‘‘ఇటువంటి వార్తలు విని మాకు ఇప్పటికే చాలా బోర్ కొట్టేసింది. అసలు ఇటువంటి వార్తలు ఏ ఆధారాలతో రాస్తారో అర్థం కావడం లేదు. అయినా మా బంధాల్నీ, బాంధవ్యాల్నీ విడదీసే శక్తి రాజకీయానికిగానీ, మరెవ్వరికీ గానీ లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి వార్తలు మళ్లీ మళ్లీ సృష్టించకండి’’ అంటూ ఆయన వ్యక్తపరిచారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles