Ap assembly discussions on political murders

political murders, ap, murders, telangana, politics, political parties, tdp, ysrcongress, jagan, ysr, chandrababau naidu, assembly, latest news, andhrapradesh news

ap assembly discusses about political murders in state : tdp, ycp fires on each other in assembly over political murders discussion on politica murders

చావు లెక్కలపై రసవత్తర చర్చ

Posted: 08/22/2014 03:49 PM IST
Ap assembly discussions on political murders

హత్యా రాజకీయాలపై ఏపీ శాసనసభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. టీడీపీ, వైసీపీ ఒకరి చావు లెక్కలు ఒకరు తవ్వి తీసుకున్నాయి. మీ హయాంలో ఇంతమంది చనిపోతే.., మీ ప్రభుత్వం ఇంతమందిని బలిగొందని దుమ్మెత్తి పోసుకున్నాయి. శాంతిభద్రతల అంశంపై స్వల్ప కాలిక చర్చ పేరుతో మొదలైన వివాదం ఎక్కడా ప్రజా శాంతిభద్రతలపై చర్చించలేదు. పూర్తిగా రాజకీయ హత్యలపై తిట్టుకోవటానికే సమయం అయిపోయింది. చర్చ సందర్బంగా ప్రస్తుత టిడిపి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని.., హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. దీనిపై టీడీపీ నిరసన తెలిపింది. అయితే ఈ ఆరోపణలను టీడీపీ తోసిపుచ్చింది. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ఘటనలను భూతద్దంలో చూపిస్తున్నారని దూళిపాళ్ళ విమర్శించారు.

అటు వెంటనే లెక్క పత్రాలతో లేచిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, వైఎస్ హయాంలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు అప్పటి ఉమ్మడి రాష్ర్టంలో 189మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని లెక్కలు చెప్పారు. అంతేకాకుండా జగన్ మొన్న 19మంది వైసీపీ కార్యకర్తల హత్య అని, ఇప్పుడు మాత్రం 11మంది హత్యకు గురయ్యారని తప్పుడు లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. రాష్ర్టంలో శాంతిభద్రతల సమస్య లేకపోయినా ప్రతిపక్షం మాత్రం అనవసర వివాదం చేస్తోందని దుయ్యబట్టారు. ఉమ మాటలపై కూడా సభలో గందరగోళం నెలకొంది. చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరికాదని వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఆధారాలు లేకుండా ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఇక మరో వైసీపీ సభ్యుడు కొడాలి నాని లేచి వైఎస్ ఓ డాక్టర్.., డాక్టర్ ఎప్పుడు ప్రాణాలు పోస్తాడు తప్ప ప్రాణాలు తీయడు అని అన్నాడు. ఇలా హత్యా రాజకీయాలపై రెండు పార్టీలు ఒకరిపై మరొకరు నిందలేసుకున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly  jagan  babu  political murders  

Other Articles