Tummala nageshwar rao set to join in trs party

tummala nageshwar rao, tdp, kamma sangam, kamma caste, chowdary, castes, religions, trs, kcr, minister, chandrababu naidu, political news, teangana news, latest updates, errabelli dayakar rao, mandava venkateshwar rao

tdp leader tummala nageshwar rao set to join ini trs : tummala will get minister post, mlc by joining trs kcr promised him

తెలంగాణలో టీడీపీకి కమ్మనేత షాక్ !

Posted: 08/22/2014 12:18 PM IST
Tummala nageshwar rao set to join in trs party

కమ్మ పార్టీగా పేరున్న టీడిపికి తెలంగాణలో ఆ వర్గం నేత షాక్ ఇచ్చారు. టి.టిడిపి ముఖ్య నేత తుమ్మల నాగేశ్వర రావు త్వరలో సైకిల్ దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన కోసం కారు రెడిగా ఉండటంతో ఎక్కేందుకు తుమ్మల కూడా తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో చేరితే తన జీవితంలో గులాబిలు పూస్తాయి తప్ప.., దేశంతో ఉంటే ఏముంటుంది ముళ్ళు తప్ప అని కమ్మనేత భావిస్తున్నారు. దీంతో గుబాలింపు నేత దగ్గరకు వెళ్ళి తన మనసులో మాట బయటపెట్టాడు. అటు గులాబి బాస్ కూడా ఇందుకు ఓకే చెప్పారట. అంతేకాదు కారెక్కగానే.., మంత్రి పదవి, ఆరు నెలల్లో ఎమ్మెల్సి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. ఇదేదో బాగుంది అనుకుని తుమ్మల గారు త్వరలోనే మీ గూటికొస్తానని మాటిచ్చారని పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు.

తుమ్మల బయటకు వెళ్తారన్న విషయం తెలిసిన వెంటనే తెలంగాణ టీడీపీ కూడా అప్రమత్తమైంది. ఆయనకు ధు కష్టమొచ్చిందో చెప్పాలని నేతలు స్వయంగా ఇంటికెళ్ళి మరీ అడిగారు. జ్వరంతో బాదపడుతున్న  నాగేశ్వర రావును ఎర్రబెల్లి దయాకర్, మండవ వెంకటేశ్వర రావు పరామర్శించారు. అయితే ఇది ఆరోగ్య పరామర్శ కాదు.., పార్టీ మారకుండా కాపాడుకునే ఎత్తు అని ఇతర పార్టీ నేతలటున్నారు. తాను ఇప్పటికే డిసైడ్ కావటంతో పాటు.. తనకోసం మంత్రి పదవున్న కారు వెయిట్ చేస్తుండటంతో వెనక్కి చూడనని టీడీపీ నేతలకు తుమ్మల షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. తుమ్మల వెళ్తే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటని లెక్కలు వేస్తున్నారు.

ఇంతకీ నాగేశ్వర్ గారి ఇంట్లో పూసేందుకు గులాబిలు అంత ఆసక్తి ఎందుకు చూపుతున్నాయంటే.. తుమ్మల కమ్మ సామాజిక వర్గ నేత. సీనియర్ నేతగా.., గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. దీంతో ఆయన గనక తమ పార్టిలోకి వస్తే కమ్మ ఓట్లు కూడా కారుకు పడతాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి అంతగా పట్టులేని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావటంతో.., ఆయన రాకతో జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు. అందుకే నాగేశ్వర్ కోసం కేసీఆర్ కారు పంపుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా.., మంత్రి పదవి, ఎమ్మెల్సి టికెట్ ఇస్తానని ఆఫర్ చేస్తున్నాడు. క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్.. కుచ్ బీ కరేగా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tummala nageshwar rao  trs  tdp  latest news  

Other Articles