Pawan kalyan counter attack to kcr on samagra kutumba survey

pawan kalyan, kcr, samagra kutumba survey, telangana survey, chandrababu naidu, kcr chandrababu naidu, governor narasimhan, pawan kalyan latest news, pawan kalyan survey, pawan kalyan telangana survey

pawan kalyan counter attack to kcr on samagra kutumba survey : janasena party president power star pawan kalyan gave explanation on samagra kutumba survey that why he didn't participate.

సర్వేపై కేసీఆర్ మాటలకు జవాబిచ్చిన పవన్!

Posted: 08/22/2014 12:15 PM IST
Pawan kalyan counter attack to kcr on samagra kutumba survey

తెలంగాణ సీఎం కేసీఆర్, పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ కల్యాణ్ మధ్య నడస్తున్న మాటలయుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన వీరి వాగ్యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే వుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకరిమీద ఒకరు విమర్వలు గుప్పించుకుంటూనే వున్నారు. ‘‘పవన్ నాముందు ఒక పిల్లకాకి’’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు... ‘‘కేసీఆర్ నోరు జాగ్రత్త’’ అంటూ పవన్ వార్నింగులు ఇచ్చుకున్న సంఘటనలైతే కోకొల్లలు. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా పవన్ కల్యాణ్ పాల్గొనకపోవడంపై కేసీఆర్ పరోక్షంగా చాలా ఘాటుగానే కామెంట్లు చేశారు. ‘‘పవన్ కల్యాణ్ తెలంగాణాలో ఒక టూరిస్టులాగే వుండాలనుకుంటున్నారేమో’’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్... ఆ తర్వాత సామాజిక నేరస్థుడు అంటూ చెప్పకనే చెప్పేశారు. ‘‘ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తూ సర్వేలో పాల్గొనకపోతే దాన్ని సామాజిక నేరం’’ అని కేసీఆర్ వర్ణించుకున్నారు.

ఇదిలావుండగా... సర్వేలో పాల్గొనకపోవడం కేసీఆర్ తన మీద చేసిన వ్యాఖ్యాలకు పవన్ కల్యాణ్ కూడా ధీటుగానే స్పందించారు. పవన్ తనదైన శైలిలో కేసీఆర్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం రానంతవరకు ఏవేవో మాట్లాడారని.. ఇప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టడమెందుకని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. నోరు మంచిదైతే ఊరూ మంచిదవుతుందన్న సామెతను గుర్తు చేస్తూ.. కేసీఆర్ కు సూచించారు. ‘‘సమగ్ర సర్వేలో పాల్గొనాలా వద్దా అనేది వాలంటరీ అని కోర్టు ముందే చెప్పింది. ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారా..?’’ అంటూ ఆయన ప్రశ్నలను లేవనెత్తారు. (సమగ్ర సర్వేలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని.. ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అప్పట్లో కోర్టు తేల్చి చెప్పేసింది. ఆ విషయాన్నే ఇక్కడ పవన్ గుర్తు చేశారు.) ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. ‘‘సమగ్ర సర్వే రోజు తాను హైదరాబాద్ లో లేనని.. అందుకే సర్వేలో పాల్గొనలేదని’’ వివరణ ఇచ్చుకున్నారు.

ఇక చంద్రబాబు, కేసీఆర్ లు ఇటీవలే అధికారికంగా కలిసిన విషయం తెలిసిందే! ఆ సమావేశంపైనా పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘‘చాలారోజుల తర్వాత ఇద్దరూ సీఎంలు ఒక మంచి పనిచేశారు. నిజంగా ఈ మీటింగ్ ఎప్పుడో జరిగి వుండాల్సింది. ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే ఇద్దరు సీఎంలు కలుసుకుని పరస్పరం మాట్లాడుకుని వుండే.. ఈరోజు రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ఆగిపోకుండా వుండేవి కాదు. ఇకనుంచైనా ఇద్దరూ కలిసికట్టుగా పనులు చేస్తే.. రెండు రాష్ట్రాల్లో వున్న ప్రజలు లబ్దిపొందుతారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. పవన్ ఇచ్చిన జవాబుకు కేసీఆర్ మళ్లీ ఎటువంటి ప్రశ్నలను సంధిస్తారో..? వీరిమధ్య ఇలాగే మాటలయుద్ధం కొనసాగుతుందా..? లేదా వీరు కూడా త్వరలోనే సమావేశమవుతారా..? అంటూ రకరకాల సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles