Ias distribution list for telangana and andhrapradesh will released today

telangana, andhrapradesh, ias, ips, civil service, appsc, upsc, telugu news, ifs service, ias list, political news, latest news, roster system

today ias division list for telangana and andhrapradesh will be released : ias in exited over the list releasing today

నేడే విడుదల. ఐఏఎస్ ల గుండెల్లో ఉత్కంఠ

Posted: 08/22/2014 10:54 AM IST
Ias distribution list for telangana and andhrapradesh will released today

క్యాప్షన్ కు ట్యాగ్ లైన్ కు సంబంధం లేదనుకుంటే పొరపాటే. సంబంధం ఉంది. ఇవాళ ఐఏఎస్ ల విభజన జాబితా విడుదల కానుంది. తెలంగాణ, ఏపీల మద్య ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను విభజించే ప్రక్రియలో భాగంగా ఇవాళ ముసాయిదా జాబితా విడుదల కానుంది. ఈ లిస్ట్ వెబ్‌సైట్‌లో పెట్టి అభ్యంతరాలు తెలిపేందుకు వారం గడువు ఇచ్చే అవకాశం ఉంది. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ప్రత్యూష్‌సిన్హా కమిటీ వారంలోపు తుది జాబితా సిద్ధంచేస్తుంది. ఆ తర్వాత ప్రధాని ఆమోదం పొందితే.., తమకు కేటాయించబడిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలే నియామక ఉత్తర్వులు జారీ చేస్తాయి.

అధికారుల కేటాయింపు తెలంగాణతో మొదలవుతుంది. దీంతో రోస్టర్ పద్ధతి ప్రకారం బేసి సంఖ్య కలిగిన అధికారులు తెలంగాణకు, సరిసంఖ్య కలిగిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడతారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ విభజన ప్రక్రియలో ఉన్నప్పటికీ వీరిని డీవోపీటీ రాష్ర్టాలకు కేటాయించినందున వారు ప్రస్తుతమున్న రాష్ర్టాల్లోనే కొనసాగుతారు.  మిగతా వారు మాత్రం కేటాయించబడిన రాష్ర్టాలకు వెళ్తారు. అభ్యంతరాల పరిశీలన పూర్తియి మరో నెలలోపు తుది జాబితా వెలువడుతుంది. తాము ఒక రాష్ర్టానికి వెళ్ళమని చెప్పినా.., తుది జాబితాలో దీన్ని పరిగణలోకి తీసుకుని మారుస్తారని గ్యారెంటీ లేదు. అంతేకాకుండా ఏ రాష్ర్టానికి పంపినా పని చేస్తామని గతంలోనే కేంద్రం అందరిచే సంతకం పెట్టించుకుంది. దీంతో విభజన లిస్ట్ లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎప్.ఎస్ లలో తాము ఏ రాష్ర్టానికి వెళ్తామో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  ias distribution  roster system  latest news  

Other Articles