Vastu problems to chiranjeevi home

chiranjeevi, chiranjeevi type 8 house, chiranjeevi delhi house, chiranjeevi house in hyderabad, chiranjeevi latest news, chiranjeevi 150 movie

vastu problems to chiranjeevi home : tollywood megastar and former central minister chiranjeevi house getting vastu problems

అయ్యో పాపం! చిరు ఇంటికి చిల్లు పడింది!

Posted: 08/21/2014 01:40 PM IST
Vastu problems to chiranjeevi home

టాలీవుడ్ మెగాస్టార్ - మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఇంటికి చిల్లు పడిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చిరు ఇల్లు అంటే హైదరాబాద్ లో వున్నది కాదులెండి.. ఢిల్లీలో వుండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిరంజీవి టూరిజం మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఢిల్లీలో టైప్ 8 అనే బంగ్లాను కేటాయించారు. ఇప్పుడు ఆ బంగ్లాకే చిల్లు పడినట్టు ఈ వార్తాసారంశం. అయితే ఈ చిల్లు వేసింది ఏ దొంగుల ముఠానో, ఏ ఎలుకలో కాదు..! ఆ ఇల్లు వాస్తు బాగోలేదని.. అందుకే చిరంజీవి కూడా తన పదవిని కోల్పోయారని రాజ్యసభ సభ్యులు చెప్పుకుంటున్నారు.

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలు కావడంతో టూరిజం మంత్రి పదవిని కోల్పోయిన చిరంజీవి.. ఇప్పుడు కేవలం రాజ్యసభ సభ్యుడిగానే మిగిలి వుండిపోయారు. దాంతో ఇప్పుడు ఆయన నివాసం వుంటున్న ఇంటిని ప్రస్తుతం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదేశాలమేరకు చిరంజీవిని తాను వుంటున్న బంగ్లాను త్వరలో ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం తెలిపింది. అయితే రాజ్యసభ సభ్యుడి హోదాలో వున్న చిరుకి ఆ పదవికి సరిపడే వేరొక బంగ్లాను కేంద్రం ఇంతవరకు కేటాయించకపోవడంతో ఆయన ఆ టైప్ 8 ఇంటిని ఖాళీ చెయ్యలేదు. ఇది వేరే విషయం!

ప్రస్తుతం చిరు వుంటున్న ఈ టైప్ 8 బంగ్లాను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కేటాయించినప్పటికీ... అతని పార్టీలో వున్న ఆయన శ్రేయోభిలాషులు ఆ నివాసంలోకి వెళ్లొద్దంటూ సూచిస్తున్నట్టు సమాచారం! ఎందుకంటే.. చిరు వుంటున్న నివాసానికి వాస్తు దోషాలు వున్నాయని.. అందుకే చిరు తన పదవిని కోల్పోవడంతోపాటు తీవ్ర అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందని వారు పేర్కొంటున్నారు. దీంతో రాజ్ నాథ్ కూడా ఆ బంగ్లాలోకి తన నివాసాన్ని మార్చుకోవడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వాస్తు వివాదాల వల్ల చిరుకి కూడా బంగ్లా ఖాళీ చెయ్యడానికి తాత్కాలిక సమయం దొరికింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  raj nath singh  bjp party leaders  chiranjeevi type 8 house  

Other Articles