Uttarakhand governor aziz khureshi warning to modi government

uttarakhand governor aziz khureshi, narendra modi, narendra modi news, narendra modi aziz khureshi, aziz khureshi latest news, supreme court news, supreme court latest news, narendra modi aziz khureshi news

uttarakhand governor aziz khureshi warning to modi government : Uttarakhand congress governor aziz khureshi giving warning to modi and his government. Because modi government has sent a notification to aziz to leave his governor post. But he is refusing that... and read more

కోర్టుకెక్కుతానని మోదీకే వార్నింగ్ ఇచ్చిన గవర్నర్!

Posted: 08/21/2014 12:23 PM IST
Uttarakhand governor aziz khureshi warning to modi government

భారత ప్రధాని నరేంద్రమోదీకి ఒక రాష్ట్రానికి చెందిన గవర్నర్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడు. మోదీ చేస్తున్న వ్యవహారాలు ఏమీ బాగోలేవని... తనను కించపరుస్తున్నారని ఆయన ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతానంటూ వాదనలు వినిపిస్తున్నాడు. అతనెవరో కాదు.. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అండదండలతో ఉత్తరాఖండ్ గవర్నర్ అయిన అజిజ్ ఖురేషీ అనే ముసలాయన! తనకింకా గవర్నర్ గిరీ మీద మోజు తీరలేదని ఆశాభావాన్ని వ్యక్తం చేసినా ఆయన... తాజాగా మోడీ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలపై ఆయన మండిపడ్డాడు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర అపజయాన్ని చవిచూసిందో మనందరికీ తెలిసిందే! కనీస ప్రతిపక్ష హోదా కూడా దానికి దక్కలేదు. ఇక భారీ మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఎన్టీయే ప్రభుత్వం తన పార్టీ పటిష్టత కోసం ఎన్నోరకాలుగా ప్రయత్నాలను మొదలుపెట్టేసింది. ఆ కోవలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా నియమితులైన గవర్నర్ లను తొలగిస్తూ వస్తోంది. దేశం మొత్తం మీదున్న గవర్నర్ లకు ఈమేరకు తమ గవర్నర్ గిరీల నుంచి తప్పించుకోవాల్సిందిగా ముందుగానే కొన్ని లెటర్లను పంపించింది. దానికి శిరసావహించిన కొంతమంది తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకోగా... మరికొంతమంది వృద్ధనేతలు మాత్రం తమ పదవులను వదులుకోవడానికి ససెమిరా అంటున్నారు.

సోనియాగాంధీ దయతో గవర్నర్ పదవులను పొందిన నాయకులను ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం తొలగించి, వారి స్థానంలో తమ పార్టీ సీనియర్ నాయకులను ఎంపిక చేసేసింది. అంత సవ్యంగానే జరుగుతున్న తరుణంలో అజిజ్ ఖురేషీ మాత్రం తన గవర్నర్ గిరీ పదవినుంచి తప్పుకోకుండా అనవసరంగా ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు ఈయనను టార్గెట్ చేసుకున్న బీజేపీ ప్రభుత్వం.. ఇతన్ను పదవి నుంచి తప్పించి తమ పార్టీ సీనియర్ నేతలను నియమించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అందుకోసం అజిజ్ పదవి నుంచి తప్పించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సూచనను కూడా జారీ చేశారు. అయితే ఈ ప్రతిపాదనపై ఖురేషీ మండిపడుతున్నాడు. తనకు గత ప్రభుత్వం నియమించిన గవర్నర్ పదవిలో ఐదేళ్లవరకు కొనసాగే హక్కు వుందని ఆయన వాదిస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన సూచనపై, రాజీనామా చేయాలన్న ఒత్తిడి గురించి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతానని ఆ పార్టీ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. తనను పదవి నుంచి తప్పుకోమని చెప్పే హక్కు కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందని... కేంద్రప్రభుత్వానికి ఆ హక్కు లేదని ఆయన పేర్కొంటున్నాడు. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తనకేమీ నచ్చలేదని.. దానిపై ఆయన కోర్టు మెట్లు ఎక్కుతానని చెబుతున్నాడు.

అయితే మోదీ ప్రభుత్వానికి గతంలో తొలగిపోయిన కాంగ్రెస్ గవర్నర్ల నుంచి ఇటువంటి వాదనలు చాలానే వినిపించాయి. తమకు గవర్నర్ పదవిలో కొనసాగే హక్కు వుందంటూ కాంగ్రెస్ నియమిత గవర్నర్లు చాలామంది బీజేపీకి వార్నింగ్ లు, హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇటువంటి బెదిరింపులకు భయపడకుండా మోదీ ప్రభుత్వం వారందరరినీ తొలగించేందుకు కొన్ని ప్రత్యేకమైన మార్గాలను అన్వేషించి.. వారిని బయటకు దొబ్బేసింది. మరీ ఈ వ్యక్తి కోసం ఎటువంటి మార్గాలను మోదీ ప్రభుత్వం అన్వేషిస్తుందో వేచి చూడాల్సిందే! ఏదేమైనా ముసలోడు మహా గెట్టోడిలా వున్నట్టు కనిపిస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aziz khureshi  narendra modi  congress party governors  supreme court of india  

Other Articles