Super star rajnikanth to join bjp party rumours after talking with amit shah on phone

rajnikanth, super star rajnikanth, rajnikanth latest news, shivaji rao gaikwad, rajnikanth narendra modi, rajnikanth amit shah, rajnikath news, rajnikanth bjp party

super star rajnikanth to join bjp party rumours after talking with amit shah on phone : bjp party plannings to spread their party in tamilnadu also by giving the cm post to super star rajnikanth. Modi already met with rajni and now amit shah is all set to met rajni

సీఎం పదవి రేసులో ‘‘రజనీకాంత్’’!

Posted: 08/21/2014 11:05 AM IST
Super star rajnikanth to join bjp party rumours after talking with amit shah on phone

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సీఎం పదవి రేసులో పాలుపంచుకోబోతున్నారా..? ఆయన స్వయంగా అయితే ఇంతవరకూ పాలిటిక్స్ గురించి ఒక్క మాట కూడా బహిర్గతం చేయలేదు కానీ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులను చూస్తుంటే ఇది నిజమేనని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన కొన్ని మీడియా కథనాల ప్రకారం... రజనీకాంత్ బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నట్టు సమాచారాలు ఫుల్లుగా షికార్లు చేస్తున్నాయి. ఏ పేపర్ తీసినా, ఏ న్యూస్ ఛానెల్ చూసినా.. ప్రజెంట్ ఇది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. రజనీకాంత్ ఇక రాజకీయ రంగంలో అడుగులు వేయడం ఖాయమంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇందుకు ముఖ్యకారణం ఏమిటంటే.. ఇటీవల బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రజనీకాంత్ తో దాదాపు అరగంటపాటు మాట్లాడినట్టు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. అదికూడా ముఖ్యంగా వీరిద్దరూ కేవలం రాజకీయ అంశాలపైనే మాట్లాడినట్టు తమిళరాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం! మొన్నిటి సార్వత్రిక ఎన్నికల సమయంలో చెన్నైకి వచ్చిన నరేంద్రమోదీ.. నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసిన విషయం తెలిసిందే! అప్పటినుంచే రజనీ బీజేపీ పార్టీలో చేరడం ఖాయమంటూ ఎన్నోరకాల వదంతులు, పుకార్లు వచ్చేశాయి. అయితే అప్పుడు రజనీ తన రాజకీయ జీవితం మీద క్లారిటీ ఇచ్చేశారు. తాను బీజేపీ పార్టీలో చేరడం లేదంటూ తేల్చి చెప్పేశారు. కానీ ఈసారి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రజనీకి ఫోన్ చేయడంపై అనుమానాలు మరీ ఎక్కువ అయిపోయాయి.

ఇదిలావుండగా.. రజనీని బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను ప్రధాని మోడీ, అమిషాకు అప్పగించినట్లు రాజకీయ రంగంలో టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీని తమ పార్టీలోని చేర్పించుకుని.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, రజనీకాంత్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. ఎన్నికల సంగ్రామంలో దిగాలని మోదీ వ్యూహం రచించారని తెలుస్తోంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం ఉత్తరాన వున్న అన్ని రాష్ట్రాల్లో ముద్ర వేసుకోగా.. ఇప్పుడు దక్షిణ భారతంవైపు కూడా ఏర్పాటు చేయాలనే దిశగా పన్నాగాలు పన్నినట్టు తెలుస్తోంది. అయితే ఒకేసారి పార్టీకి పెద్ద గుర్తింపు రావాలంటే అందుకు బడా వ్యక్తులను తీసుకుంటే మంచిదని భావించిన తరుణంలో... ఇలా రజనీ వెంటపడినట్లు సమాచారం! రజనీ తమ పార్టీలోకి జాయిన్ అయితే.. ఆయనకు సీఎం పదవిని అంటగట్టి తమ ప్రభుత్వాన్ని వ్యాపించచేయాలన్నదే వారు లక్ష్యంగా చేసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం అమిత్ షా హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన తమిళనాడు చేరుకుని అక్కడ కూడా రెండురోజులపాటు పర్యటించనున్నట్టు సమాచారం! ఈ నేపథ్యంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి, రాజకీయ కార్యకలాపాలపై మంతనాలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సీఎం ఆఫర్ ని అంగీకరిస్తారా..? ఆయన రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని మొదలుపెడతారా..? లేదా గతంలోలాగే తాను రాజకీయ రంగంలోకి అడుగులు పెట్టనని స్పష్టం చేస్తారా..? ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే.. మరికొన్ని రోజులవరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnikanth  narendra modi  bjp party  amit shah  tamilnadu politics  

Other Articles