Who is contesting from medak mp in by poll

medak mp, medak by poll, by polling in india, telangana, kcr, trs, deviprasad, kodandaram, kishan reddy, damodara raja narsimha, congress, bjp, tdp, tjac, jaipal reddy, latest news, tngo, deviprasad

all parties of telangana put eye on medak mp seat which is going to by poll on septemer 13th : medak mp seat allocation is heated between parties of telangana

మెదక్ ఎంపి స్థానం ఎవరిది?

Posted: 08/20/2014 06:56 PM IST
Who is contesting from medak mp in by poll

దేశంలో ఉప ఎన్నిక నగారా మోగింది. దేశ వ్యప్తంగా ఏప్రిల్, మేలో జరిగిన 9దశల పోలింగ్ లో వివిధ కారణాలతో బైపోలింగ్ కు అవకాశం ఏర్పడిన స్థానాలకు ఈసి నోటిఫికేషన్ ప్రకటించింది. సెప్టెంబర్ 13న ఆ స్థానాల్లో ఉప ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. దీంతో ఆయా స్థానాల్లో తమ తమ బలాబలాలు, పార్టీ టిక్కెట్లపై ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణలోకి వచ్చే సరికి అందరి దృష్టి మెదక్ ఎంపీ స్థానంపై ఉంది. ఈ సారి ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటి చేశారు. రెండు చోట్లా గెలవటంతో ఎంపి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడీ స్థానం ఎవరిది అనే అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది.  ప్రతి రాజకీయ పార్టీ కూడా మెదక్ ఎంపి టికెట్ పై హాట్ హాట్ గా చర్చించుకుంటున్నాయి.

పార్టీలవారిగా చూస్తే.., ముందుగా టీఆర్ ఎస్ విషయానికొస్తే.., పార్టీ నేత, సోని ట్రావెల్స్ అధినేత కె. ప్రభాకర్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించేవారిలో ముందున్నారు. తనకు కేసీఆర్ టికెట్ ఇస్తారని బలంగా నమ్ముతున్నారు. ప్రభాకర్. అటు తెలంగాణ ఎన్జీవో సంఘం అద్యక్షుడు దేవిప్రసాద్ కు ఈస్థానం కేటాయిస్తారని ప్రాచం జరుగుతోంది. అధినేత నుంచి స్పష్టమైన హామి వస్తే పదవికి రాజీనామా చేసేందుకు దేవి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ఈయనకు ఉద్యోగుల మద్దతు కూడా ఉంది. మరోవైపు మల్కాజ్ గిరి నుంచి పోటి చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు, మహిధర్ ప్రమోటర్ ప్రశాంత్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరు కారులో ప్రచారం చేస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అందరూ ఎవరికి వారు పూర్తి ధీమాతో ఉన్నారు. కేసీఆర్ సింగపూర్ టూర్ నుంచి వచ్చిన తర్వాత టికెట్ ఎవరికనేది తేలనుంది. ఈ లోపు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.., హస్తంలో కూడా ఈ సీటుపై నేతల మద్య పోటి నెలకొంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన నేత, ఉమ్మడిరాష్ర్ట మాజి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ పోటికి సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధోల్ నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ వద్ద గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ను సమర్ధంగా ఎదుర్కోవటంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. ఇందు కోసం కారుకు డ్యాషిచ్చేలా టీజేఏసీ చైర్మన్ కోదండరాం ను బరిలోకి నిలపాలని భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై ప్రొఫెసర్ ఇంకా స్పందించలేదు. ఆయన వద్దంటే మాజి మంత్రి జైపాల్ రెడ్డి, లేదా మరొకరిని నిలపాలని చూస్తోంది. అయితే టికెట్ తనకిస్తే గెలుపు ఖాయమని నివేదికలు, బలాల లిస్టులతో దామోదర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

అటు బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా పార్టీ తెలంగాణ అద్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటి చేస్తారని ప్రచారం జరుగుతోంది. మేలో జరిగిన ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరగా హైకమాండ్ వద్దని చెప్పటంతో ముందుగా అంబర్ పేట నుంచి పోటి చేయనని ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. చివరకు అదిష్టానం బుజ్జగింపుతో అంబర్ పేట నుంచి పోటి చేసినట్లు పలువురు నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు వెళ్ళాలన్న తన కోరికను మెదక్ ఉప ఎన్నికతో నిజం చేసుకోవాలని కిషన్ భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన న్యాయవాది రఘనందన్ రావు పేరు కూడా ప్రచారంలో ఉంది. రఘునందన్ కు స్థానిక బలం ఉండటంతో పాటు, డబ్బు ఓట్లు చీల్చగల శక్తి ఉంది. దీంతో టికెట్ తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ప్రధానంగా ఈ మూడు పార్టీల్లోనే టికెట్ పై ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. తోచిన ప్రతి తలుపూ తడుతున్నారు. నేతలను ఓ సారి కదిలిస్తున్నారు. అయితే ముందుగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటిస్తే దానికి అనుగుణంగా తాము అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి కారులో గులాబీ పరిమళం వస్తుందో తెలియాలంటే కేసీఆర్ సింగపూర్ పర్యటన నుంచి రావాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medak mp  by poll  latest news  politics  

Other Articles