Pjr daughter and ysrcp leader vijayareddy jumps into trs party

yscrp leader vijayareddy, nizamabad mp kavitha, trs party leaders, mahmood ali, nayini narasimha reddy, k keshava rao

pjr daughter and ysrcp leader vijayareddy jumps into trs party : ysr congress leader vijayareddy joins trs party in telangana bhavan in the presence of ali, nayini and kk

‘‘ఫ్యాన్’’ను పడేసి.. స్పీడుగా వెళ్తున్న ‘‘కార్’’ ఎక్కింది!

Posted: 08/20/2014 06:21 PM IST
Pjr daughter and ysrcp leader vijayareddy jumps into trs party

(Image source from: pjr daughter and ysrcp leader vijayareddy jumps into trs party)

ఇదేదో యాక్షన్ సన్నివేశంలో హీరోయిన్ చేస్తున్న స్టంట్ అయితే కానేకాదులెండి... ఫ్యాన్ గుర్తు పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నేత - పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రస్తుతం అంతులేని స్పీడులో పరిగెడుతున్న ‘‘కార్’’ గుర్తు పార్టీ టీఆర్ఎస్ లోకి చేరారు. అదీ విషయం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న నాయకులందరికీ సరైన గౌరవం దక్కడం లేదని... తమకు తెలియకుండానే ఆ పార్టీ అధ్యక్షుడు తనకిష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటాడని ఆమె ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆమె తప్పక ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని... అందుకే టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులైన కేకే, నాయిని నరసింహారెడ్డి, మహమూద్ అలీ, ఎంపీ కవిత సమక్షంలో తెలంగాణ భవన్ లో వైకాపా నేత విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ పటిష్ఠత కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. పార్టీ విజయంకోసం, సామాన్య ప్రజల కోసం తాను పాటుపడతానని పేర్కొన్నారు. ఈమె పార్టీలోకి చేరడానికి ముందు బుధవారం (20.08.2014) మధ్యాహ్నం ఖైరతాబాద్ లోని పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక మహంకాళి వద్ద పూజలు చేసి.. తెరాస పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. మంత్రి పద్మారావు ప్రారంభించిన ఈ ర్యాలీలో.. ఒంటెలు, గుర్రాలు, ద్విచక్రవాహనాలతో పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి ఆమె తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.

వైకాపానేత విజయారెడ్డి తమ టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయారెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని’’ చెప్పారు. రేపటి నుంచి టీఆర్ఎస్ లోకి మరింత మంది వచ్చి చేరుతారని... జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని కవిత వెల్లడించారు. అలాగే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తమ పార్టీ పూర్తిగా పాటుపడుతోందని పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya reddy  mp kavitha  mahmood ali  nayini narasimha reddy  k keshava rao  

Other Articles