Finance minister of ap gif

yanamala, ap budget, ap ministry, ap ministers, telangana ministers, ap government, telanagana govenment, chandrababu naidu, kcr, ap assembly, jagan, ycp, congress, tdp, bjp, mim, cpi, ap latest news

finance minister of ap yanamala introduces ap budget : ap budget with rs 1,11,884 crore introduced by yanamala

లక్షా 11వేల కోట్లతో ఏపీ బడ్జెట్

Posted: 08/20/2014 12:01 PM IST
Finance minister of ap gif

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రాష్ర్ట 2014-15 సంవత్సర బడ్జెట్ ను ఆ రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 1,11,884 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ. 85,151 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 26,673 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. రాష్ర్ట ద్రవ్యలోటు రూ.19,028 కోట్లు, రెవిన్యూ లోటు రూ.6,064 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. . కొన్ని సంవత్సరాలుగా అవినీతి, కుంభకోణాలు రాష్ర్టంలోరాజ్యమేలాయని.., వీటి ప్రభావంతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. అస్థవ్యస్థ వ్యవస్థను సరిదిద్దుకుంటూ.., అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అవినీతిలో కూరుకపోయిన రాష్ర్టాన్ని తిరిగి పునరుత్తేజం చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అటు విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని యనమల చెప్పారు. విభజన సందర్బంగా ఆదాయ పంపిణి సరిగా జరగలేదన్నారు. అంతేకాకుండా పునర్విభజన చట్టంలో అనేక సమస్యలను గత కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సక్రమ ప్రణాళికలకు అవకాశం లేకుండా విబజన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


వివిధ శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

హోంశాఖకు రూ.3,737 కోట్లు

విపత్తు నిర్వహణ శాఖకు రూ.403 కోట్లు

ఐటీ శాఖకు రూ. 111 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 615 కోట్లు

నీటి పారుదల శాఖకు రూ. 8465 కోట్లు

ఇంధన శాఖకు రూ. 7164 కోట్లు

మైనార్టీ సంక్షేమ శాకు రూ. 371 కోట్లు

యువజన సర్వీసుల శాఖకు రూ. 126 కోట్లు

వికలాంగ సంక్షేమం, వృద్ధులకు రూ.65 కోట్లు

మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 1,049 కోట్లు

బీసీ సంక్షేమ శాఖకు రూ. 3,130 కోట్లు

గిరిజన సంక్షేమ శాఖకు రూ. 1,150 కోట్లు

రోడ్లు, భవనలశాఖ రూ.2,612కోట్లు

మౌలిక వసతులకు రూ.73కోట్లు

అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ రూ. 418కోట్లు

ఉన్నత విద్యశాఖకు రూ.2,275 కోట్లు

ఇంటర్ విద్యకు రూ.812 కోట్లు

పాఠశాల విద్యాశాఖకు రూ.12,595 కోట్లు

గ్రామీణాభివృద్ధి కోసం రూ. 6,094 కోట్లు

పంచాయతీ రాజ్‌శాఖకు రూ.4,260 కోట్లు

వైద్య ఆరోగ్యశాఖకు రూ.4,388 కోట్లు

కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు

పట్టణాభివృద్ధిశాఖకు రూ.3,134 కోట్లు

గ్రామీణ నీటి సరఫరాకు రూ1,115 కోట్లు

తమ ప్రభుత్వం కేవలం కేటాయింపులకే పరిమితం కాదని మంత్రి యనమల స్పష్టం చేశారు. కేటాయించిన ప్రతి రూపాయిని ఖర్చు పెడతామన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా బడ్జెట్ ఖర్చు చేస్తామని చెప్పారు. పాదయాత్ర సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించిన అనేక ప్రజా సమస్యల పరిష్కారం ఆదారంగా బడ్జెట్ లో కేటాయింపులు రూపొందించామన్నారు. బీసీలకు కూడా ప్రత్యేక ఉప ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో కొత్త ఒరవడి అవసరమన్నారు. సమగ్ర ప్రజాభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని యనమల తెలిపారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap budget  latest news  assembly  yanamala  

Other Articles