Dasari narayana rao fires on survey enumerates for asking his caste

dasari narayana rao, dasari narayana, dasari narayana survey, dasari narayana rao enumerators, telangana survey, samagra kutumba survey

dasari narayana rao fires on survey enumerates for asking his caste : the former central minister - director dasari narayana rao fires on survery enumerators for asking his caste

‘‘కులం’’ అడిగినందుకు ఫైర్ అయిన దర్శకుడు!

Posted: 08/20/2014 11:25 AM IST
Dasari narayana rao fires on survey enumerates for asking his caste

తెలంగాణలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో కొన్ని విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు కొంతమంది ప్రముఖులు తమ పూర్తి వివరాలు ఈ సర్వేలో నమోదు చేయిస్తే.. మరికొంతమంది మాత్రం ఇందులో పాల్గొనలేదు. మరికొంతమందైతే విచిత్రం ప్రవర్తించారు కూడా! బ్యాంకు వివరాలు ఎందుకు ఇవ్వాలంటూ నిప్పులు చెలరేగారు. దాదాపుగా సామాన్య ప్రజలు తమ ఎన్యూమరేటర్లకు తమ పూర్తి వివరాలు అందించగా.. ప్రముఖుల్లో కొంతమంది కొన్ని వివరాలు మాత్రమే అందించారు. అందులో కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు.

సర్వేలో భాగంగా దాసరి ఇంటికి చేరుకున్న ఎన్యూమరేటర్లు మొదట ఆయన నుంచి అన్ని వివరాలను సేకరించారు. అయితే ‘‘కులం’’ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కులం వివరాలు ఇచ్చేందుకు ఆయన పూర్తిగా నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కులం వివరాలు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఆయన తెగేసి చెప్పారు. కులం ముఖ్యం కాదని.. అసలు లిస్ట్ లో ఆ కాలమ్ ను తీసేయాలంటూ ఆయన ఎన్యూమరేటర్లకు సూచించారు. దీంతో వారు కులానికి సంబంధించిన వివరాలు రాసుకోకుండానే సర్వేను పూర్తి చేసి వెళ్లిపోయారు. ఇదిలావుండగా.. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో..? అసలు దీని ఉద్దేశమేమిటో..? అంటూ దాసరి కొన్ని ప్రశ్నలను సంధించారు. మరి దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  telangana survey  samagra kutumba survey  

Other Articles