Mla from goa suggested bikini beach for getting money and to develope tourism

goa mla, mla lavu mamledar, goa beach, goa tourism, goa holiday spot, goa beauties, goa hotels, restaurants, bikini, bikini beach, latest news

goa mla lavu mamledar suggested to start a special bikini beach : bikini beach may get more income and develope tourism says goa mla

బికినీ బీచ్ బేషుగ్గా.. ఉంటుందోచ్

Posted: 08/18/2014 09:19 AM IST
Mla from goa suggested bikini beach for getting money and to develope tourism

చదివిస్తే ఉన్నమతి పోయిందన్నట్లు తయారయింది మన నేతల వ్యవహారం. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన పాలకులే వాటిని మంటగలుపుతున్నారు. కాసులకు కక్కుర్తి పడమని సలహా ఇస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రజల అవసరాలను తీర్చాలన్న విషయం పక్కనబెట్టి.., విలాసాలవైపు అడుగులు వేస్తున్నారు. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దేవుడా అని కొందరు తలలు పట్టుకుంటుంటే.., బట్టలు విప్పేస్తే పోలా అంటూ మరికొందరు వెకిలి మాటలు మాట్లడుతున్నారు. అత్యాచారాలను ఖండిస్తున్న నేతలు.., అంతే చిత్తశుద్ధిగా వాటికి దారితీసే చర్యలను ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాల్లో బికినీ సీన్లు తొలగించాలని ఓ వైపు మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు బహిరంగంగానే బికినీలు ధరించవచ్చని కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడీ బికినీలపై బిగ్ డిబేట్ నడుస్తోంది గోవాలో.

సినిమాల్లో బికినీలపై వివాదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ లోగా బహిరంగంగా బికినీ ధరించటంపై చర్చ మొదలయింది. ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా బికినీ బీచ్ పెడితే పోలా? అంటూ సెలవిచ్చారు. ఈ ఐడియా వచ్చింది మహారాష్ర్టవాది గోమంతక్ పార్టి ఎమ్మెల్యే లావు మామ్లేదర్ గారికి. అంతే కాదు బికినీ స్పెషల్ బీచ్ కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించి ఓ అభివృద్ధి ప్రణాళికనే రచించారు ఆ మహానుభావుడు. ఆయనగారి గొప్ప మెదడులో వచ్చిన విలువైన ఆలోచన ఏంటంటే.., బికినీ బీచ్ లోపలకు ఎంట్రన్స్ ఫీజు వెయ్యి రూ.ల నుంచి 2వేల రూ. వరకుండాలి. అంతేకాదు టూ పీస్ బికినీలకు ప్రత్యేక టోల్ ట్యాక్స్ వసూలు చేయాలట. ఇక బికినీ బీచ్ చుట్టూ ప్రత్యేక కంచె ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలట. ఇలా చేస్తే ఆదాయం రావటంతో పాటు పర్యాటకం కూడా విపరీతంగా పెరుగుతుందని తన మాస్టర్ ప్లాన్ వివరించారు. అయితే ఈ బికినీ బీచ్ లోకి అబ్బాయిలను అనుమతించాలా లేదా అనేది సారు సెలవివ్వలేదు. బహుషా దీనిపై ఆయన అహర్నిశలూ అధ్యయనం చేస్తున్నారనుకుంటా!.

ఈ ప్రతిపాదనపై విపక్షాలు భగ్గుమన్నాయి. లావు మామ్లేదర్ వంటి నేతలు దేశ సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలను కించపర్చేలా ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని కాంగ్రెస్ మహిళా నేతలు హెచ్చరించారు. పాలకులకు ప్రజా సమస్యలు, వారి అవసరాలు తీర్చాలన్న ద్యాస కంటే ఇలాంటి విషయాల మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటోందని విమర్శిస్తున్నారు. మదిలో మెదిలిన గొప్ప దరిద్రపు ఆలోచనను బయట పెట్టిన మామ్లేదర్ తనపై వస్తున్న విమర్శలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goa mla  bikini beach  goa tourism  latest news  

Other Articles