Facebook introduce new internet app

facebook new internet app, facebook release new internet app, new internet app for facebook users, the founder of facebook, mark zuckerberg latest news, mark zuckerberg released new internet app, free internet app, facebook latest news, facebook latest applications, facebook released new applications

facebook introduce new internet app : the facebook which is largest social networking website in the world is introducing new internet application (internet.org) for those who don't have internet supply

ఫేస్ బుక్ వినియోగదార్లకు ఇదో బంపరాఫర్!

Posted: 08/01/2014 06:06 PM IST
Facebook introduce new internet app

ప్రస్తుతం యుగంలో మొబైల్ ఫోన్లను నెటిజన్లు ఎలా ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే! బస్సులో సరిగ్గా నిల్చోవడానికి సరిగ్గా స్థలం లేకపోయినా... చేతిలో స్మార్ట్ పోన్లను ఆపరేట్ చేయడం మాత్రం వదిలిపెట్టరు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్లు అన్నాక అందులో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, ఇంటర్నెట్ సేవలు అంటూ ఎలాగూ వుంటాయి... వాటినే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆపరేట్ చేస్తూనే వుంటారు.

ప్రస్తుతం నిర్వహించిన కొన్ని గణాంకాల ప్రకారం.. ఇంకా అనేక చోట్ల ఇంటర్నెట్ అందుబాటులో లేనివారు గణనీయంగా వున్నారని ‘‘ఫేస్ బుక్’’ సంస్థ పేర్కొంది. మొత్తం ప్రపంచ జనాభాలో 85శాతం మంది ప్రజలు నివసించే ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ లు వినియోగంలో వుండగా... 30 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో వున్నాయి. అటువంటివారు మాత్రమే ఫేస్ బుక్ ను విస్తృతంగా వినియోగిస్తున్నారని తేలింది. దీంతో ప్రతిఒక్కరికీ అందుబాటులో వుండే విధంగా సరికొత్త మొబైల్ అప్లికేషన్ ను విడుదల చేసినట్లు ఫేస్ బుక్ వెబ్ సైట్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు.

‘‘ఇంటర్నెట్.ఆర్గ్’’ అనే పేరుతో విడుదలయిన ఈ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. ఎవరైనా ఉచితంగా ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చని సదరు సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. స్థానికంగా వైద్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు, వాతావరణానికి సంబంధించిన సమాచారం కోసం ప్రాథమిక స్థాయిలో కమ్యూనికేషన్స్ కోసం ఫ్రీగా దీనిని బ్రౌజ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఫేస్ బుక్, గూగుల్ సెర్చ్, వికీపీడియాను కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు.

అయితే ఈ ఆప్ అప్పుడే మనకు అందుబాటులో రాలేదు లెండి. జాంబియాలోని ఎయిర్ టెల్ వినియోగదారులు ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇక్కడి ఫీడ్ బ్యాక్ ను ఆధారం చేసుకుని మిగిలిన దేశాల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. అంటే త్వరలోనే ఈ ఆప్ మన భారతదేశానికి కూడా రాబోతోందన్నమాట! ఒకవేళ ఇది సక్సెస్ అయితే.. యూత్ కి పండగే పండగ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles