A weeping child saved her mother and family members

weeping child saved her family members, child weeping saved her mother, maharashtra state malin village, 4 members saved by their weeping child, child weeping news

A weeping child saved her mother and family members from the death in maharashtra

పెద్దలకే ప్రాణం పోసిన చిన్నారి ఏడుపు!

Posted: 08/01/2014 12:43 PM IST
A weeping child saved her mother and family members

అవును... ఒక చిన్నారి ఏడుపు పెద్దలకు ప్రాణం పోసింది. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ పెద్దలకు ప్రాణం పోసి, దేవతగా అవతారమెత్తింది. ఎవరూలేని నిర్ఘాంతప్రాంతంలో చనిపోతున్న ఆ పెద్దల ప్రాణాలను ఒక చిన్నారి ఏడుపు బతికి బయటపడేలా చేసింది. మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన!

మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో కొండకు దిగువ భాగాన కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. సుఖంగా కాలం గడుపుతున్న ఆ కుటుంబాల జీవితాల్లో వర్షం రూపంలో కష్టాలు ఎదురయ్యాయి.  వర్షాలు కుండపోతగా కురవడం వల్ల కొండపై వున్న మట్టిదిబ్బలు కరిగి వారి నివాసాలపై పడ్డాయి. దీంతో దాదాపు 40 నివాసాలు ధ్వంసం కాగా.. 51 మంది చనిపోయారు. మరో 150 మంది ఆచూకీ ఇంకాల తెలియరాలేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే ఒక ప్రాంతం నుంచి ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం సహాయకచర్యలు చేపట్టిన అధికారులకు వినిపించింది. వెంటనే వారు అక్కడికి చేరుకుని బురదను తొలగించి చూడగా.. ఓ పాపతో సహా తన తల్లి కూడా కనిపించింది. ఆ తల్లి తన చిన్నారికి ఎటువంటి హానీ జరగనీయకుండా రక్షణగా తన శరీరాన్ని ఆ పాపపై కప్పేసిన స్థితిలో వుంది. అధికారులు వారిద్దరినీ బయటికి తీస్తుండగానే.. అక్కడే మరో ఇద్దరు తమకు సహాయం అందిచాల్సిందిగా కేకలు వేశారు. అరుపులు వినిపించిన దిశలో అధికారులు వెళ్లి మట్టిని తొలగించి చూడగా.. అక్కడ ఆ పాప బామ్మ, తాతయ్యలు బయటపడ్డారు.

ఇలా ఈ విధంగా ఆ పాప ఏడుపు తన కుటుంబసభ్యుల ప్రాణాలను కాపాడుకుంది. ఆ చిన్నారి పేరు రుద్ర. వయస్సు కేవలం మూడు నెలలు మాత్రమే. తాను బిడ్డకు పాలు ఇస్తుండగా.. ఒక్కసారిగా మట్టిదిబ్బలు విరిగి ఇంటిపై పడ్డాయని.. ఆ పరిస్థితిలో బయటపడ్డానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదని రుద్ర తల్లి పేర్కొంది. అలాగే రుద్ర బామ్మ శకుంతల మాట్లాడుతూ.. తామె అంతటి ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డామో అర్థం కావడం లేదని పేర్కొంది. ప్రస్తుతం వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles