Telangana cm kcr cinema city plan in hyderabad

Telangana cm kcr Cinema City, Telangana, telangna development, telangna govt Cinema City plan, kcr telangana cm, cinema city 2000 acre in hyderabd, film industry developement

Telangana cm kcr Cinema City plan in hyderabad: Telangana Chief Minister K. Chandrasekhar Rao is planning to set up a ‘Cinema City’ spread over 2,000 acre in Hyderabad with an aim of giving a fillip to the film industry besides giving job opportunities to locals: Telangana to get a Cinema City in 2,000 acres soon

కేసిఆర్ సినిమాకు వేల ఎకరాలు !

Posted: 08/01/2014 09:51 AM IST
Telangana cm kcr cinema city plan in hyderabad

రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు సినిమా సిటీ రాబోతుంది. ఇందులో సినీ నిర్మాణానికి అవసరమైన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అన్ని రకాల పరికరాలు, వసతులు కల్పించాలని ఆయన సంకల్పించారు. రెగ్యులర్ స్టూడియోలతో పాటు గ్రాఫిక్స్ ఇతర విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నది ఆయన విజన్‌గా ఉంది. సచివాలయంలో పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

సినిమా సిటీ ఇప్పటికే ఇక్కడున్న సినీ పరిశ్రమకు చేదోడు వాదోడుగా ఉంటుందని, రాజధానిలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ఫలితంగా స్థానికులకు మరిన్ని ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని, సాహితీరంగంలోని వారికి కూడా మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ప్రముఖ స్థానం చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ ఇక్కడినుంచి తరలిపోతుందన్న అభిప్రాయాలను ఆయన కొట్టిపారేశారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశ్రమ హైదరాబాద్‌నుంచి తరలిపోదని అంటూ ఇంతటి మంచి వాతావరణం ఉన్న నగరం ఎక్కడా లేదని నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. చాలాకాలంగా సినిమా షూటింగులు, టీవీ సీరియల్ నిర్మాణాలు హైదరాబాద్‌లో బాగా పుంజుకున్నాయని తగిన వసతులు కల్పిస్తే ఇతర రాష్ర్టాల వారు కూడా వస్తారని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా ఈ సినిమా సిటీ నిర్మాణం జరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆయన మార్గదర్శనం చేశారు. అంతర్జాతీయంగా సినిమాల్లో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్‌లాంటి సాంకేతిక అంశాలకు చాలా ప్రాముఖ్యం పెరిగిందని, ఇలాంటి అధునాతన ధోరణులను గమనించి తదనుగుణంగా సినిమా సిటీని రూపొందించాలని ఆయన సూచించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangna development  Cinema City plan  

Other Articles