Hanuman reincarnation in punjab muslim family

Hanuman reincarnation Punjabi Muslim, Hanuman God boy Muslim, Punjabi boy with tail worship, Punjabi Muslim boy with tail

Hanuman reincarnation in Punjab Muslim family: Punjabi Muslim boy with tail

పంజాబ్ లో ముస్లింగా హనుమాన్ జననం!

Posted: 07/31/2014 05:59 PM IST
Hanuman reincarnation in punjab muslim family

పంజాబ్ లో ముస్లింల ఇంట్లో పుట్టిన హనుమంతుని అవతారంగా ఒక యువకుడికి పూజలు చేయటానికి కారణం అతనికి ఏడు అంగుళాల ఆకారంలో వెనక భాగంలో తోక ఏర్పడటమే.  హనుమాన్ మళ్ళీ పుట్టాడంటూ ఆ యువకుడిని బాలాజీ అని పిలవటం సేవలు చెయ్యటం మొదలుపెట్టారు. చాలామందికి వ్యాధులు తగ్గాయని, అనుకున్నవి నెరవేరాయని సందర్శించే భక్తులు అంటున్నారు.  

ఆ అబ్బాయి తాత ఇక్బాల్ ఖురేషీ మాట్లాడుతూ, అతను భగవంతుడి స్వరూపమేనని తామూ నమ్ముతున్నామని, అతనికి నమస్కారాలు చేసి ఆశీర్వాదం తీసుకోవటం వలన ప్రజల మనోభీష్టాలు నెరవేరటం ఆనందంగానే వుందని అన్నారు. అయినా, చిన్న ప్రాయంలోనే ఉన్నా వీల్ ఛైర్ కే అంకితమైన ఆ పిల్లవాని బాగుకోసం ఎవరైనా డాక్టర్లు ముందుకొచ్చి ప్రాణహాని ఉండదని హామీ ఇచ్నినట్లయితే శస్త్ర చికిత్స చేసి దాన్ని తొలగించటానికి తమకి అంగీకారమేనని కూడా అంటున్నారు.

తనకి ఈ తోక ఇచ్చింది భగవంతుడేనని, దానివలన అందరూ వచ్చి తనకి పాదాభివందనం చెయ్యటం తనకి ఇష్టంగానూ లేదు, అయిష్టంగానూ లేదని, దీనివలన వాళ్ళకి మంచి జరిగితే అంతకంటే ఇక కావలిసిందేమిటని అంటున్నాడా దైవ పుత్రుడు.  

కానీ గడచిన ప్రాయం కంటే జీవించాల్సిన ప్రాయం ఎంతో ఎక్కువగా ఉంది కాబట్టి శస్త్ర చికిత్స చేయించటానికి మొగ్గు చూపిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles