Boss at office cook at home airtel ad

Boss at office ad Airtel ad, Bharti Airtel latest ad adverse comments, Adverse comments on Airtel ad

Boss at office cook at home Airtel ad: Latest Bharti Airtel ad disapproved by many

ఇంట్లో ఇల్లాలు.. బయట... ఎయిర్ టెల్ అడ్ సంచలనం

Posted: 07/31/2014 03:37 PM IST
Boss at office cook at home airtel ad

భారతీ ఎయిర్ టెల్ సంస్థ ఎన్నో వ్యాపార ప్రకటనలను తయారు చేస్తుంటుంది.  అందులో తాజాగా వచ్చిన అడ్ మీద పలు సంచలన వ్యాఖ్యానాలు వచ్చాయి.  

ఇంట్లో ఇల్లాలు, ఆఫీసులో అధికారిణి స్టోరీ అది! 

ఆఫీస్ లో బాస్ గా తన కింద పనిచేసే అతన్ని చివాట్లు పెట్టి ఓవర్ టైం చేయించే ఆమె ఇంటికెళ్లి స్వహస్తాలతో భర్తకి ఇష్టమైన వంటచేసి దాన్ని వీడియోలో భర్తకి పంపించి అతని నోరూరేట్లుగా చేసి ఇంటికి త్వరగా రమ్మని పిలవటం విశేషం.  

అసలు ఇందులో మౌలికమైన విషయం వీడియోలను 3జి ద్వారా మరొకరికి పంపించగలగటం.  దాన్నే అందంగా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని సుందరంగా చిత్రీకరిస్తూ చూపించటం జరిగింది.  భర్తకి ఏమిష్టమో తెలుసుకుని మరీ తయారుచెయ్యటం, ఆఫీసులో బాస్ గా చివాట్లు పెట్టిన భర్తనే భార్యగా గోముగా ఇంటికి రమ్మని పిలవటం జరిగింది.

అయితే, మహిళాకోణంలో తీసిన వీడియోలో ఎయిర్ టెల్ అందులో విఫలమైందని కొందరు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.  ఇద్దరూ పనిచేస్తూ జీతాలు తీసుకుంటూ షోఫర్ డ్రైవ్ చేసే కారులో ఇంటికిపోయే స్థాయిలో ఉన్నామె స్వయంగా చెయికాల్చుకోవటమేమిటని, మంచి భోజనం తయారుచెయ్యగలిగితే మాత్రం నౌకర్లను పెట్టుకోగూడదా అని కొందరంటే, భార్యగా ఆమె పాత్ర బాగానే వుంది కానీ, మరీ ఆఫీసులో అలా ఉండటమే ఏ భర్తకూ నచ్చదు అని, ఆడవాళ్ళు ఆఫీసుల్లో బాస్ అయితే తప్పేమిటి అని, మహిళాభ్యుదయంలో సున్నితమైన విషయాన్ని చెప్పటానికి ఎయిర్ టెల్ చాలా గట్టిగా ప్రయత్నం చేసిందని మరికొందరు ఇలా వ్యాఖ్యానాలు చేసారు.  

ఎక్కడి పాత్రను అక్కడ ఆమే కాదు అతనూ చక్కగా పోషించాడు.  భర్తను రమ్మని ప్రేమగా పిలిచిన భార్యతో అమ్మో బాస్ అనుమతి కావాలి అంటాడు భర్త.  స్క్రిప్ట్ చాలా బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది.  ఇక చిన్న చిన్న విషయాలను చిన్న అడ్ లో చూపించటం కష్టం.  ఇంటిలో తీసిన తక్కువ షాట్స్ లో నౌకర్లున్నా కనపడాలని లేదు కదా.  భర్తకు ఏం కావాలో కనుక్కుని నౌకర్ల సాయం తీసుకునే స్వయంగా చేసివుండవచ్చు కదా.  మరి అలా అయితే ఆఫీస్ లో కూడా బయట వాచ్ మన్, లోపల చాలామంది కొలీగ్స్, అటెండర్లుండవచ్చు.  వాళ్ళంతా కనిపించలేదే అంటే?  మరో విషయమేమిటంటే, ఇద్దరూ పనిచేస్తున్నప్పుడు భర్త కూడా వంట చెయ్యవచ్చు కానీ అతనికి ఆఫీస్ లో పని అప్పచెప్పిందే ఆమె కదా. 

మరో విషయం- ఆఫీస్ లో అలా కఠినంగా ప్రవర్తించటం కర్తవ్య నిర్వహణలో ఆమె బాధ్యత అనుకుంటే దాని వలన సంసారంలో ఇబ్బందులు రాగూడదనుకుని దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చెయ్యటం తప్పు కాదు సరికదా అవసరం కూడా!

అయినా స్వయంగా వండి వడ్డించటంలో గృహిణికి కలిగే సంతృప్తి ఏ పదాల్లో చెప్తే అర్థమౌతుంది?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles