Army jawan ear cut off

Army Jawan Ear cut off, Ear cut off for mustaches, Army jawan mustaches asked to cut, Miscreants cut off Jawan ear

Army Jawan Ear cut off for refusing to cut mustaches

మీసం తీయనందుకు చెవి కోసారు

Posted: 07/30/2014 04:24 PM IST
Army jawan ear cut off

ఈ అమానుష చర్య బీహార్ రాజధాని పాట్నా లోని బిహ్తా లో జరిగింది.  

కౌడియా గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ రామానుజ వర్మ సోమవారం డ్యూటీ చేసి తిరిగి వస్తుండగా లల్కూ యాదవ్, బీనా యాదవ్ సోదరులు అతన్ని అడ్డగించారు.  అతని మీసాల మీద వ్యాఖ్యలు చేస్తూ దాన్ని తీసెయ్యమని అన్నారు.  మొదట్లో గేలి చేస్తూ మాట్లాడిన మాటలు ఇంకా తీవ్రరూపం దాల్చి మీసాలును కత్తిరిచేయమని, ఈసారి మీసాలతో చూస్తే వాళ్ళే వాటిని కట్ చెయ్యవలసివస్తుందని గట్టిగా చెప్పటంతో రామానుజ వర్మ అందుకు అంగీకరించలేదు.  

దానితో ఇంకా ఆగ్రహించిన ఇరువురు సోదరులు ముందు అతన్ని కొట్టటం ప్రారంభించారు.  ఆ తర్వాత ఇంకా కొందరు స్నేహితులను పిలిచి అతని మీద కత్తులు ఇతర ఆయుధాలతో దాడి చేసారు.  బీనా యాదవ్ తన చెవి కట్ చేసాడని, అతని బైక్, ఇతర వస్తువులను తీసుకుని పరారయ్యారని రామానుజ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles