More energy crisis with hyderabad metro

energy crisis with Hyderabad Metro, Power crisis more Hyderabad Metro, More power to Hyderabad Metro rail project, Power crisis in Telangana, More power crises with Hyderabad Metro

More energy crisis with Hyderabad Metro: Metro rail in Hyderabad likely to aggravate power crisis in Telangana

మెట్రోకీ విద్యుత్? ఏడికెళ్ళి తేవాలె?

Posted: 07/30/2014 03:56 PM IST
More energy crisis with hyderabad metro

అసలే తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందంటే ఒక పక్క మెట్రో రైలు వస్తోందన్న ఆనందం హైద్రాబాద్ వాసులకు కలుగుతున్నా, దాన్ని నడపటానికి కూడా విద్యుత్ కావాలన్నిది భయం కలిగిస్తోంది.  ఇప్పటికే కరెంట్ కోతలతో బాధపడుతున్న నగరవాసులకు మెట్రో రైలుతో కూడా విద్యుత్ ని పంచుకోవటమంటే కాస్త ఇబ్బందికరమైన విషయమే.  

మెట్రో పట్టా ఎక్కితే హైద్రాబాద్ లోనే కాదు తెలంగాణా మొత్తం మీద విద్యుత్ కోతలు ఎక్కువయ్యేట్టుగా కనిపిస్తోంది.  

పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ పనిని త్వరగా చేస్తేనే మెట్రో రైలు కదులుతుంది, ఇంట్లో దీపాలు, వీధి దీపాలు వెలుగుతాయి.  

మెట్రో అధికారులు తమవంతుగా మెట్రో నడపటానికి విద్యుత్ అవసరం ఎంతపడుతుందనేది తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేసారు.  ఇక దాన్ని సమకూర్చటం ప్రభుత్వం వంతు.  ఈ విషయంలో ఇదమిద్ధమైన ప్రణాళికేమీ లేకపోయినా, ఏదో అద్భుతం జరిగి కష్టాలు గట్టెక్కుతాయన్న నమ్మకంతోనే ముందుకెళ్తున్నట్లుగా ఉంది కానీ విద్యుత్ లోటుని ఎలా తీర్చాలన్నది ఇంకా పాలుపోయినట్లుగా కనపడటం లేదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles