Nandi idol drinks milk and water in temple

nandi idol drinks milk and water, nandi idol consuming milk and water in lord shiva temple, lord shiva temple chhattisgarh

nandi idol consuming milk and water in lord shiva temple

భక్తులందించే పాలు, నీరు సేవిస్తున్న నంది విగ్రహం

Posted: 07/30/2014 03:04 PM IST
Nandi idol drinks milk and water in temple

మంగళవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రాయ్ పూర్ లో జరిగిన వింత ఇది.  శివాలయంలోని నంది విగ్రహం భక్తులు సమర్పించే పాలు, నీరు గ్రోలటం భక్తులకు ఆనందాశ్చర్యాలు కలిగించాయి.  తండోపతండాలుగా భక్తులు శివాలయానికి చేరుకుని ఆ అద్భుతాన్ని తిలకించటంతోపాటు తామూ పాలను సమర్పించాలని పోటీపడ్డారు.

అయితే విగ్రహాలు పాలు తాగటం గమనించటం ఇది మొదటిసారి కాదు.  1995 లో హైద్రాబాద్ లో వినాయకుడి విగ్రహం పాలు తాగటంతో మొదలైంది.  తొండం దగ్గర పాలు పెడితే ఆ విగ్రహం పీల్చుకోవటంతో భక్తులు బార్లు తీరి పాలను సమర్పించటం, దేశంలో ఇతర వినాయకుడి విగ్రహాలకు కూడా పాలను అందించటం జరిగింది.  వినాయకుడి తొండం గొట్టంలా ఉండబట్టి అలా పీల్చుకునే అవకాశం ఉండివుండవచ్చని సైంటిఫిక్ గా కారణాలు చెప్పుకున్నారు.  ఈ వార్త విని ఢిల్లీలోని వినాయకుడి ఆలయాలలో కూడా క్యూలు కట్టారు భక్తులు.  ఆ రోజు నగర పాలిక అధికారులు అదనంగా లక్ష లీటర్ల పాలను సరఫరా చెయ్యవలసివచ్చింది.  విదేశాల్లో కూడా ఆ రోజు అదే జరిగింది.  ఆలయాల్లోనే కాకుండా ఇంట్లో పెట్టుకున్న గణేష్ మహరాజ్ కూడా భక్తులు ఇచ్చిన పాలను సేవించాడు. 

ఇది రెండు రోజులపాటు జరిగింది.  భారతదేశంలో జరిగిన తెల్లవారి లండన్ లో వినాయకుడి విగ్రహానికి తమవంతు భక్తిని పాలు సమర్పించి చూద్దామనుకున్న భక్తులు అక్కడా క్యూలు కట్టారు.

అనిలా ప్రేమ్ జీ అనే మహిళ పశ్చిమ లండన్ లో విశ్వ టెంపుల్ లో నందీశ్వరుడి దగ్గర స్పూన్ తో పాలు పెడితే చటుక్కున మాయమయ్యాయి.  స్వామి నారాయణ ఆలయం దగ్గర జరిగిన కోలాహలం వలన పాలు పట్టుకుని వస్తున్నవాళ్ళని లోపలికి అనుమతించని పరిస్థితి ఏర్పడింది.   కెనడా, కాలిఫోర్నియాలో కూడా హిందూ విగ్రహాలు పాలు తాగటం నిజంగా చమత్కారమేనని, దైవ లీలేనని హిందూ భక్తులు నమ్మారు.  ఆలయ దర్శనానికి పెద్దగా ఆసక్తి చూపించనివాళ్ళు కూడా ఆ సమయంలో దైవదర్శనం చేసుకున్నారు.  2012 లో కూడా నందీశ్వరుడే కాదు పరమేశ్వరుడు కూడా పాలు తాగి చూపించాడు.  

జీవితంలో నమ్మకమే ముఖ్యం.  దైవ భక్తి, విశ్వాసాలు ఉండబట్టే ప్రపంచం ఈమాత్రం ప్రశాంతంగా నడుస్తోంది.  ఆ నమ్మకాన్ని కాదని నిరూపించే శాస్త్రవేత్తలు, హేతువాదులు ఎవరికి లాభం చేస్తున్నట్లు.  అయినా ఒకళ్ళు మోసపోయారంటే పరవాలేదు కానీ మాస్ హెల్యూసియేషన్ అనే పేరు పెట్టి మూకుమ్మడిగా మూర్ఖులయ్యారని అనటం సరికాదేమో.  దైవ విగ్రహంలో దైవం ఉన్నభావన ఎంత శక్తివంతమైనదో ఆ విగ్రహంలోని దైవం పాలు తాగిందన్నది కూడా అంతే శక్తివంతమైన విశ్వాసం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles