Four coaches of lalkuan express gets derailed due to fight between bull and cow

bull and cow fighting in railway track, Four coaches train derailed, Lalkuan Express train derailed, bull and cow fight train derailed, Lalkuan Express derail, Four coaches derail, Daliganj railway station, Lucknow

Four coaches of lalkuan express gets derailed due to fight between bull and cow: Four coaches of a train derailed late on Monday here when a fighting bull and cow suddenly came on the railway tracks and hit engine of the moving Lal Kuan Express, officials said. But no passenger was injured.

ఆవు-ఎద్దు ఫైట్ చూసి పట్టాలు తప్పిన రైలు

Posted: 07/30/2014 01:03 PM IST
Four coaches of lalkuan express gets derailed due to fight between bull and cow

వేగంగా రైలు కూత పెట్టుకుంటూ పట్టాలపై పరుగులు తీసుకుంటూ వస్తూంది. అయితే ఇంతలో.. ఒక బడాయి ఆవు, మరో లడాయి ఎద్దు కయ్యానికి కాలుదువ్వి.. రంకెలు వేస్తూ . కొమ్ములతో కొట్టుకోవటం మొదలుపెట్టాయి. ఎవరి బలం ఎంతో తెల్చుకోవటానికి ..తోకలు రెండు పైకి ఎత్తి రైల్వే పట్టాలపై వీరోచితంగా పోరాడుకుంటున్నాయి. అయితే రైలు పట్టాలపై లాల్ కూనా ఎక్స్ ఫ్రెస్ వేగంగా వస్తున్నకొద్ది ..రైల్వే ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

ఆవు, ఎద్దు సహజంగా కొట్టుకోవటం చాలా అరుదుగా జరుగుతాయి. ఆవు , ఆవు కొట్టుకోవటం, ఎద్దు ఎద్దు కొట్టుకోవటం సహజం చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఆవు, ఎద్దు కొట్టుకోవటం చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆవు, సహజంగా ఎద్దు చూస్తే .. దూరంగా పారిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం నువ్వా-నేనా అంటూ పోటీ దిగటం చాలా ఆశ్చర్యంగా ఉంది.

అయితే ఆవు ఎద్దు అలా కొట్టుకుంటూ పట్టాలపైకి వచ్చిన లాలా కునా ఎక్స్ ప్రెస్ ఇంజన్ ను ఢీ కొట్టాయి. దీంతో ఆ ఎక్స్ ప్రెస్ రైలు నాలుగు స్లీపర్ కోచ్లు పట్టాలు తప్పాయి. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని దాలిగంజ్ రైల్వేస్టేషన్ సమీపంలో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది.

ఆ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. రైలు ప్రయాణికులలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. రైలు కోచ్ లను పట్టాలపైకి ఎక్కించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.

అయితే ఈ ఘటన లో ఆవు, ఎద్దు తీవ్రంగా గాయపడ్డాయి. అయితే వెంటనే రైల్వే అధికారులు.. పశువైద్యశాలకు ఆవును, ఎద్దును తరలించారు. కానీ ఆవు పరిస్థితి .. విషమమంగా ఉందని .. పశువైద్యులు చెబుతున్నారు. కానీ ఎద్దుకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు దృవీకరించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles