Flipkart cofounders assets at par with infosys cofounders

Flipkart rising to reach Infosys, Flipkart cofounders worth $ 1 Bn, Flipkart raises funds worth $1 billion, Flipkart cofounders assets Rs.6000 cr

Flipkart cofounders assets at par with Infosys cofounders: Flipkart cofounders assets worth 1 billion dolor.

ఫ్లిప్ కార్ట్ సంస్థాపకుల సంపదలు ఇన్ఫోసిస్ కి దీటుగా

Posted: 07/30/2014 11:53 AM IST
Flipkart cofounders assets at par with infosys cofounders

ఫ్లిప్ కార్ట్ ఇ కామర్స్ సంస్థ విజయగాధ ఇది-

సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ (ఇద్దరూ బంధువులు కారు) ల ఉమ్మడి సంపదలు 1 బిలియన్ డాలర్లకు పైబడే ఉన్నాయని, దేశంలోనే ఐటి రంగంలో రెండవ స్తానంలో ఉన్న ఇన్ఫోసిస్ సహ సంస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని ల కుటుంబ సభ్యుల ఆస్తులతో దీటుగా ఉన్నాయని తెలుస్తోంది.  

తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల ఫండ్ ని కంపెనీలోకి తీసుకునిరావటం, అందులో 15 శాతం బన్సల్ ల ఉమ్మడి వాటా ఉండటంతో వాళ్ళ ఆస్తుల విలువ రూ.6000 కోట్లని అంచనా వెయ్యవచ్చు.  

ఇన్ఫోసిస్ సహ సంస్థాపకులతో పోలిస్తే, నారాయణ మూర్తి కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.8700 కోట్లు, నిలేకని కుటుంబ సభ్యుల ఆస్తులు 6500 కోట్లు కాబట్టి ఫ్లిప్ కార్ట్ సహసంస్థాపకుల ఆస్తులు
వారిద్దరి స్థాయికీ చేరుకుంటున్నాయని చెప్పవచ్చు.

అంతేకాదు, ఇన్ఫోసిస్ ను వీడి వెళ్ళిపోతున్న సిఇవో ఎస్ డి షిబూలాల్ కుటుంబ ఆస్తులు రూ.4300 కోట్ల కంటే ఎక్కువ.  ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన మరో సహసంస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.6500 కోట్లు.  

ఇక సంస్థాపరంగా పోలిస్తే, ఇన్ఫోసిస్ 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంస్థ.  ఆ సంస్థ సంపాదించిన మార్కెట్ విలువు 30 బిలియన్ డాలర్లు.  ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వాటా విలువ 7 బిలియన్ కోట్లు.  

అందుకు ఆ సంస్థ పనిచేసింది 7 సంవత్సరాలు.  2011 నుంచి 2014 వరకు మూడు సంవత్సరాలలో ఫ్లిప్ కార్ట్ 10 మిలియన్ డాలర్ల టర్నోవర్ ని 2 బిలియన్ డాలర్లు అంటే 100 రెట్లు పెంచుకుంది.  

ఎందుకింత అభివృద్థి ఇంత తక్కువ కాలంలో కలిగిందీ అంటే భారత దేశంలో ఇ కామర్స్ విపరీతంగా పెరగటమే కారణం.  భారతదేశంలో భవిష్యత్తులో రిటైల్ వ్యాపారమంతా ఇంటర్ నెట్ ద్వారా జరుగుతుందని ఫ్లిప్ కార్ట్ సంస్థలో పెట్టుబడులను పెంచే సమయంలో సహసంస్థాపకులు బన్సల్స్ ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.  సంస్థలో జరిగిన అపూర్వమైన అభివృద్ధి రేటు విషయంలో మాట్లాడుతూ, మేము ఊహించినదానికి ఎన్నో రెట్లు వృద్ధి చెందిందని సంతోషాన్ని వ్యక్తపరచారు.

ఫ్లిప్ కార్ట్ కి పోటీదార్లు అమెజాన్, స్నాప్ డీల్ ఇ కామర్స్ వెబ్ సైట్స్

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles