2 gym instructors held for 6 year old s alleged gang rape

6-Year-Old Gang-Raped in bangalore, six-year-old-s rape case, bangalore crime news, Gym Instructors Arrested for Allegedly Raping Bangalore 6Year Old, Vibgyor International School, 6 years girl raped, two gym instructors arrested police, MN Reddi bangalore city Police Commissioner

2 gym instructors held for 6-year-old's alleged gang rape:The Bangalore City police arrested two gymnastic instructors of the school on Monday in connection with the crime that occurred on July 3. It was 10 days ago that Mustafa was arrested

బెంగళూరు గ్యాంగ్ రేప్ లో ఇద్దరు చిక్కారు!

Posted: 07/30/2014 11:33 AM IST
2 gym instructors held for 6 year old s alleged gang rape

బెంగుళూరులో ఆరేళ్ల బాలికపై అత్యాచార కేసు దర్యాప్తు పై పోలీసులు దూకుడు పెంచారు. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఆరేండ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ఇద్దరు జిమ్ ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు అరెస్టు చేశా రు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తూ అరెస్టుచేసిన స్కేటింగ్ ఇన్‌స్ట్రక్టర్ ముస్తాఫాకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఈ ఘటనలో అతని పాత్ర ఏమీ లేదని నిర్ధారించారు. గ్యాంగ్‌రేప్ జరిగిన పాఠశాలలో పనిచేస్తున్న జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్ లాల్‌గిరి, వసీం పాషాను పోలీసులు అరెస్టు చేశారు.

వీళ్లిద్దరూ విబ్జియార్ స్కూల్‌లో కాంట్రాక్టు ఉద్యోగులుగా వున్నారు. ఆగస్టు ఫస్ట్ వరకు వీళ్లని తమ కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. స్థలంలో లభించిన సాక్ష్యాల ఆధారంగానే అరెస్టు చేసినట్లు బెంగుళూరు పోలీసు కమిషనర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు.

ఆరేళ్ల బాలికపై విబ్జియార్ స్కూల్ టెర్రెస్‌పై జులై 2వ తేదీన అత్యాచారం జరిగింది. ఈ ఘటన జులై 14న వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటనపై బెంగుళూరులో నిరసనలు పెల్లుబికాయి. తొలుత స్కేటింగ్ ఇన్‌స్ర్టక్టర్ ముస్తాఫా అలియాస్ మున్నాను, తర్వాత విబ్జియార్ స్కూలు చైర్మన్ రుస్తుం కెరావల్లానూ అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి చైర్మన్ యత్నించాడన్న ఆరోపణపై ఐపీసీ 201 సెక్షన్ కింద, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని 23వ సెక్షన్ కింద అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles