Eamcet verification of certificates from aug 7

APSCHE Chairman L.Venugopal Reddy , EAMCET CONSELLING, EAMCET counselling notification, AP EAMCET 2015 Exam Result, AP EAMCET 2014 Notification, Supreme Court eamcet, Supreme Court L.Venugopal Reddy, Eamcent controvercy, andhrapradesh Eamcent, Telangana eamcet, eamcet students, L Venugopal Reddy press meet, eamcet latest news, eamcent latest notification,

: EAMCET-Verification of Certificates from Aug 7 : A notification for certificate verification will be released on July 30 for the qualified students from both Telangana and Andhra Pradesh states, according to Prof L Venugopal Reddy, Chairman of APSCHE. “As the hearing of EAMCET couselling case will be on August 4 in the Supreme Court, we are expecting to get clarity on the issue before starting the process,” he added

ఎంసెట్ అడ్మిషన్ల బాద్యత మాదే! రెడ్డి

Posted: 07/30/2014 10:51 AM IST
Eamcet verification of certificates from aug 7

తెలుగు రాష్ట్రాలలో ని ఎంసెట్ విద్యార్థుల జీవితాలపై చీకటి కమ్ముకుంటున్న సమయంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ ఎల్ . వేణుగోపాల్ రెడ్డి ఒక్క అడుగు ముందుకేసి, విద్యార్థుల జీవితాలకు భరోసా ఇవ్వటం జరిగింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కు సంబంధించిన కౌన్సెలింగ్, అడ్మిషన్ల నిర్వహణ బాద్యత రాష్ట్ర ఉన్న విద్యామండలిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనూ, రెండు రాష్ట్రాలలోను ఎంసెట్ కౌన్సెలింగ్ , అడ్మిషన్ల బాధ్యత మాదే అని ఎల్ .వేణుగోపాల్ రెడ్డి చెప్పటం జరిగింది.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.. కలిసి వస్తే.. విద్యార్థులకు మంచి జరుగుతుంది. లేకపోతే .. భారీ ఎత్తున్న నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అయితే మేము సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, ఎంసెట్ అడ్మిషన్ల జరుగుతాయని అన్నారు. ఆగస్టు ఒకటిన వృత్తివిద్యా కోర్సులు ప్రారంభం కావాలని , సీట్లు మిగిలితే మళ్లీ నోటిపై చేసి అన్ిన సీట్లు ఆగస్టు 15 కల్లా భార్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని ఎల్. వేణుగోపాల్ రెడ్డి చెప్పటం జరిగింది.

అయితే ఏరోజు సుప్రీం కోర్టు ఎంసెట్ కౌన్సెలింగ్, అడ్మిషన్లను ఆపాలని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. సుప్రీం కోర్టు అభిమతానికి లోబడే ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ఇప్పటి కే ఎంసెట్ అడ్మిషన్లు ప్రక్రియ ఆలస్యం కావటంతో.. విద్యార్థులు . ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం జరుగుతుంది. అంతేకాకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ ను త్వరగా నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయటం జరిగిందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్ల ఆలస్యానికి కారణాలను వివరిస్తూ ఉన్నత విద్యామండలి ఆగస్టు 4లోగా సుప్రీం కోర్టులో పీటిషన్ వేస్తుందని ఆయన అన్నారు.

ట్టప్రకారం ప్రవేశాలను మండలి చేపడుతుందని వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. అయితే వచ్చే నెల 4న సుప్రీం కోర్టు తీర్పు సానుకూలంగా ఉంటే యథాతథంగా సర్టిఫికేట్ల పరిశీలన చేపడతామని , లేకుడా 5న ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్టారావు .విద్యా మండలి చైర్మన్ ఫ్రొఫెసర్ ఎల్ వేణగోపాల్ రెడ్డి కలిసి .. ఎంసెట్ అడ్మిషన్ల పై చర్చలు జరపటం జరిగింది. అంతేకాకుండా.. సుప్రీంకోర్టు లో ఏపీ వాదనను లాయర్ బలంగా వినిపించలేదని చెప్పటం జరిగింది. ఇదే పద్దతి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజ్ ఎల్ వేణుగోపాల్ రెడ్డికి పోస్ చేసి , జరగబోయే ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles