Ap cm post crown of thorns chandrababu

AP CM Chandrababu Naidu, CM position crown of thorns Chandrababu, New AP State Problems, Farm loans waiver, RBI against farm loan waiver scheme

AP CM post crown of thorns as per Chandrababu, finacial problems of AP state increasing

ముళ్ళకిరీటం లో ఇంకా పెరిగిపోతున్న ముళ్ళు

Posted: 07/29/2014 04:48 PM IST
Ap cm post crown of thorns chandrababu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవినాశించి, మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నెలకొల్పినా, ముఖ్యమంత్రి పదవి ముళ్ళ కిరీటమే అని వ్యాఖ్యానించారు.  అప్పటికి సమస్య కేవలం ఆర్థిక రూపంలోనే కనిపించింది.  సిబ్బందికి జీతాలివ్వటమే ఇబ్బందిగా కనిపించింది.  కానీ మైత్రీ బంధంతో వెన్నుదన్నులనందిస్తానన్ని భారతీయ జనతా పార్టీ కి చెందిన మన ప్రధానమంత్రి అండగా ఉండగా ఇక ముందు అంతా పండగే అన్న భ్రమ కూడా ఉండేది.  అప్పుడే ముళ్ళ కిరీటమైన ముఖ్యమంత్రి పదవికి మరి కొన్ని ముళ్ళు ఇప్పుడు అదనంగా చేరాయి.  కేంద్రం నుంచి నిధులు ఏమాత్రం రాలేదు.  

రాజధాని స్థాపన ఎక్కడ జరగాలి అన్నదో సమస్యగా మారింది.  కమిటీలను పెట్టి అదంతా కేంద్రమే తేల్చేస్తుంది, నిర్మాణానికి నిధులను పంపిస్తుంది అని అనుకుంటే అదేదో మీరే నిర్ణయించుకోండి అంటూ కేంద్రం ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదనే పెట్టింది.  ఔను మన రాజధాని ఎక్కడో మనమే నిర్ణయించుకుందాం అని ముందు అనుకున్నా, భూసేకరణ సమస్య భూతద్దంలో కనిపిస్తోందిప్పుడు.  ధరలు విరపీతంగా పెరిగిపోవటం వలన భూసేకరణ చట్టానికి లోబడి రాజధాని నిర్మాణానికి కావలసిన భూసేకరణ చెయ్యటమనేది కుదిరే పనిలా లేదు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజముద్ర పడలేదింకా.  అదేదో జరిగితే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు భూకేటాయింపులతో కొంత ధనం ముందుగానే సమకూరుతుంది అనుకుంటే అదీ జరగలేదు.  

చంద్రబాబు నాయుడు తానుగా తగిలించుకున్న ముళ్ళల్లో ఒకటి రైతుల ఋణమాఫీ.  ఎన్నికల ముందు హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫునుంచైనా లక్షన్నర వరకు పంట ఋణాలు, బంగారు ఋణాలు, డ్వాక్రా ఋణాల మాఫీకి బ్యాంకులు సహకరించటం లేదు, రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరాలు తెలిపింది.  పోనీ ఋణాలను రిషెడ్యూలింగ్ చేయిస్తే నైనా సులభంగా వాటిని ప్రభుత్వం కట్టటానికి ఉపయోగపడుతుందనుకుని అందుకు ప్రయత్నాలు చేసి, దాదాపు అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిందన్న వార్త పట్టుకొచ్చి తెలుగు దేశం నాయకులు పండుగలు చేసుకున్నారు, ఆనందాలు పంచుకున్నారు.  కానీ తాజాగా రిషెడ్యూలింగ్ కి కూడా రిజర్వ బ్యాంక్ తిరస్కరించింది.  అందుకు కారణం ఆర్ బి ఐ రాష్ట్రంలోని బ్యాంక్ ల ద్వారా తీసుకున్న వివరాలనుబట్టి గత సంవత్సరాలలో రిషెడ్యూలింగ్ కి అనుమతి ఇవ్వవలసినంత పంట నష్టమేమీ జరగలేదు రాష్ట్రంలో.  కిసాన్ క్రెడిట్ కార్డ్ లను బట్టి, రైతుల ఖాతాలలోని సొమ్ముని బట్టి చూస్తే ఋణాలను తిరిగి ఇవ్వలేని స్థితి రాష్ట్రమంతా ఏర్పడిందన్న దాఖలాలు కనిపించటం లేదన ఆర్ బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలీ పంత్ జోషీ అన్నారు.  

ఫీజ్ రియంబర్స్ మెంట్ కి కూడా ప్రభుత్వ ఖజనా సహకరించేట్లుగా లేదు.  దొంగలనుంచి పట్టుకున్న ఎర్ర చందనం దుంగలు తప్ప ఆదాయ వనరులు మరేమీ కనిపించటం లేదు.  కానీ అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం.  

ఋణమాఫీ చెయ్యటం సాధ్యం కాని పనని, కేవలం వోట్ల కోసమే చంద్రబాబు ఆ మాటలంటున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ముందు నుంచే పాటపాడుతున్నారు.  పోయినవారం రిషెడ్యూలింగ్ జరిగిపోతున్నదన్న ధీమాతో ఇంకేమిటి ఋణాల మాఫీ జరిగిపోతోంది అని ప్రకటించటం జరిగింది, మహిళలు ప్రత్యేకంగా వచ్చి చంద్రబాబుకి కృతజ్ఞతలను తెలియజేయటం కూడా జరిగింది.  ఇప్పుడది జరగకపోతే ప్రజల్లో విశ్వాసం పోతుందనే భయం, దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయని మరో భయం కూడా ఉంది.  

మీ ఆదాయ వనరులు మీరు చూసుకోండి, మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి, నిధులకోసం క్యూలు కట్టకండని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంగా చెప్పటం జరిగింది.  గుజరాత్ కి, ఢిల్లీ ముంబై కారిడార్ కి నిధులను ఇచ్చనట్లుగా మాకూ ఇవ్వండి లేకపోతే మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పగలిగే పరిస్థితి కూడా ఎన్నికల ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు.  ఎందుకంటే భాజపాకి పూర్తి మెజారిటీ వచ్చింది, ఎన్డియే సభ్యులు లేకుండానే కేంద్రప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలదు కానీ పోనీలే అన్నట్లుగా దయా దాక్షిణ్యాలు చూపిస్తూ ఎన్టిడే సభ్యులకు కూడా ప్రభుత్వంలో ప్రాధాన్యతనివ్వటం జరిగింది.  అవసరానికి కాకుండా స్నేహపూర్వకంగా అవకాశం ఇచ్చిన పార్టీని బెదిరించటానికి కూడా అవకాశం లేదు.  

ఏ వైపు వెళ్దామన్నా దార్లు మూసుకుపోతున్న సందర్భంలో, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాడో చూద్దాం, హామీలను ఎలా నెరవేరుస్తాడో చూద్దాం, ఆ పని చెయ్యకపోతే ఆయన పని చూద్దాం అని ప్రతిపక్షాలు కాచుకుని కూర్చున్న సందర్భంలో చంద్రబాబు ముళ్ళకిరీటం మరిన్ని ముళ్ళతో బాధాకరం, భారీదన్నాన్ని సంతరించుకుంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles