Rss opposes ramjan celebrations at govt treasury cost

RSS opposes Ramjan Iftar, BJP follows RSS rules, Ramjan feast by Indian Govt stopped, Ramjan feast Gujarat Govt stopped

RSS opposes Ramjan celebrations at Govt treasury cost: Modi Govt and Gujarat state Govt did not observe taditional Ramjan feast

హిందూ పండుగను చెయ్యనప్పుడు రంజాన్ ఎందుకు?

Posted: 07/29/2014 03:59 PM IST
Rss opposes ramjan celebrations at govt treasury cost

హిందూ పండుగలను ప్రభుత్వం తరఫునుంచి నిర్వహించనప్పుడు రంజాన్ ని ఎందుకు నిర్వహించాలన్నది ఆర్ఎస్ఎస్ ప్రశ్న.  ఇంతకు ముందు సంవత్సరం వరకు యుపిఏ ప్రభుత్వం నడుస్తున్నంత కాలం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందులను రాష్ట్రాలలో గవర్నర్లు నిర్వహించారు, కేంద్రంలో కూడా ప్రభుత్వం తరఫున నిర్వహించే విందులో సోనియా గాంధీ, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పాల్గొనేవారు.  కానీ ఈసారి సర్కార్ మారటంతో ఆనవాయితీ కూడా మారిపోయింది.  

కేంద్ర ప్రభుత్వమే కాదు గుజరాత్ రాష్ట్రంలోను ఇఫ్తార్ విందు ఏర్పాటు చెయ్యలేదు.  ఇది ముస్లింలకు వ్యతిరేక విధానం కాదన్న విషయాన్ని తెలియజేయటం కోసం హిందూ పండుగలను నిర్వహించనప్పుడు ప్రభుత్వ ఖజానాలో సొమ్ముని ఉపయోగించి రంజాన్ చేసుకోవటం ఎందుకని ఆర్ ఎస్ ఎస్ వాదన.  అదే సిద్ధాంతం భాజపాది కూడా కాబట్టి ఇఫ్తార్ విందులకు ఫుల్ స్టాప్ పెట్టటం జరిగింది.  

ముస్లింలకు పెద్ద పండుగ రంజాన్.  అందువలన ఈ మాసాంతంలో చేసుకునే ఆ పండుగకు ఆచారంగా వస్తోందనో లేక మైనార్టీ మద్దతును కోరిగాని కాంగ్రెస్ పార్టీ వేడుకలను నిర్వహించేది.  మరి దసరా, దీపావళి, శ్రీరామనవమి లాంటి పండుగలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించదు అని అడుగుతున్నారు ఆర్ ఎస్ ఎస్ నాయకులు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles